బీహార్ రాష్ట్రంలోని గయాలో నివసించే ఆ కుటుంబానికి పక్షులను పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. పక్షులను కూడా సొంత బిడ్డల తరహాలో అపురూపంగా చూసుకుంటారు. అయితే కొన్నిరోజులుగా శ్యామ్‌దేవ్ ప్రసాద్ గుప్త, సంగీత గుప్త దంపతులు పెంచుకుంటున్న చిలుక కనిపించకుండా ఎటో వెళ్లిపోయింది. దీంతో ఆ కుటుంబం నానా హైరానా పడుతోంది. తాము అనేక రకాలుగా ప్రయత్నించినా చిలుక కనపడలేదని శ్యామ్‌దేవ్ ప్రసాద్ గుప్త దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తమ చిలుక కనిపించడం లేదని గయాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా శ్యామ్‌దేవ్ కుటుంబీకులు పోస్టర్లు అతికించారు. తమ చిలుకను పట్టిస్తే రూ.5,100 బహుమతి ఇస్తామని పోస్టర్ల ద్వారా వెల్లడించారు. 12 ఏళ్లుగా తాము ఈ చిలుకను పెంచుకుంటున్నామని.. తమ చిలుకను ఎవరు తీసుకెళ్లినా తిరిగి ఇచ్చేయాలని శ్యామ్‌దేవ్ దంపతులు విజ్ఞప్తి చేస్తున్నారు. చిలుక ఆచూకీపై సోషల్ మీడియా ద్వారా కూడా తెగ ప్రచారం చేస్తున్నారు. చెట్ల దగ్గరకు వెళ్లి రోజూ తాము మాట్లాడుకునే భాషలో పిలుస్తున్నా చిలుక దొరకడం లేదని వాళ్లు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
Power Crisis: భారత్‌లో విద్యుత్సంక్షోభం.. 1100 రైళ్లు రద్దు..!