తమిళనాడులో సీఎం స్టాలిన్ అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతోంది. గత ఏడాది మే 7న డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది. దాదాపు పదేళ్ల తర్వాత తమిళనాడులో డీఎంకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ ప్రభుత్వ బస్సులో ప్రయాణించారు. మెరీనా బీచ్‌లో ఉన్న తన తండ్రి కరుణానిధి స్మారక చిహ్నం అన్నా మెమోరియల్‌కు బస్సులో వెళ్తూ ప్రయాణికులు, కండక్టర్‌తో ముచ్చటించారు. డీఎంకే పాలన ఎలా ఉందని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. స్టాలిన్ స్వయంగా […]
ఏపీ సర్కారుపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీలో జగన్ పాకుడు మెట్ల మీద ఉన్నారని.. ప్రతిరోజూ ఆయన కొద్ది కొద్దిగా దిగజారిపోతున్నారని ఎద్దేవా చేశారు. జై జగన్ కాదు.. గో బ్యాక్ జగన్ అని ప్రజలే నినాదాలిస్తున్నారని ఎమ్మెల్యే గోరంట్ల ఆరోపించారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు టూర్ మూడు రోజుల పాటు అద్భుతంగా జరిగిందని.. ఏపీ ప్రభుత్వం ఛార్జీలతో విపరీతంగా బాదేస్తుందని ప్రజలే చెబుతున్నారని ఆయన విమర్శించారు. ఓ చేత్తో డబ్బులు […]
మండు వేసవిలో ఏపీకి తుఫాన్ అలర్ట్ పొంచి ఉంది. ఏపీలో ఓ వైపు ఎండలు దంచికొడుతుండగా… మరోవైపు అకాల వర్షాలు ప్రజలకు ఉపశమనం కలిగించడంతో పాటు ఆర్థికంగా నష్టాన్ని చేకూరుస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా వాయవ్య దిశగా పయనించి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 8 నాటికి ఈ వాయుగుండం తుఫాన్‌గా రూపు సంతరించుకుంటుందని… ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల మధ్య ఈ […]
ఐపీఎల్‌లో శుక్రవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు 5 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. అయితే ఓపెనర్లు శుభారంభం అందించినా.. ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేసినా ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓడిపోవడంపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఆటగాళ్ల నిర్లక్ష్యమే ఈ ఓటమికి కారణమంటూ ఆరోపిస్తున్నారు. మరొక్క విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాల్సిన గుజరాత్ టైటాన్స్ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోవడం వాళ్ల నిర్లక్ష్యానికి పరాకాష్ట అంటూ […]
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ముంబై ఇండియన్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. 178 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేసింది. చివరి ఓవర్‌లో 9 పరుగులు అవసరం కాగా.. ముంబై బౌలర్ డానియల్ శామ్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేకాకుండా రాహుల్ […]
కోర్టు ధిక్కరణ కేసులో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు జైలుశిక్ష విధించింది. ఈ కేసులో ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, వీరపాండ్యన్, అరుణ్ కుమార్‌లకు నెలరోజుల పాటు జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. కర్నూలు జిల్లాలో వీఏవో నియామకం విషయంలో ఇచ్చిన తీర్పును అమలు చేయలేదన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో ధర్మాసనం తీర్పు అమల్లో ఐఏఎస్ అధికారులు నిర్లక్ష్యం వహించినందుకు హైకోర్టు జైలుశిక్ష విధించింది. […]
సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన కొత్త చిత్రం సర్కారు వారిపాట. ఈ నెల 12 ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా యూనిట్‌కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ల రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 10 రోజుల పాటు టికెట్లపై రూ.45 మేర పెంచుకోవచ్చంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఏపీలో రాధే శ్యామ్, ఆర్.ఆర్.ఆర్, ఆచార్య సినిమాల తరహాలో సర్కారు వారి పాట సినిమాకు […]
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 177 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (43), ఇషాన్ కిషన్ (45) రాణించారు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (13) విఫలమయ్యాడు. పొలార్డ్ (4) కూడా వెంటనే వెనుతిరిగాడు. కాగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మరోసారి రాణించాడు. తిలక్ వర్మ 16 […]
పశ్చిమ బెంగాల్ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి ఇంటికి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్‌షా కలయిక కారణంగా గంగూలీ బీజేపీలో చేరతారా అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. అయితే తన ఇంటికి వచ్చిన అమిత్ షాకు గంగూలీ సాదరంగా ఆహ్వానం పలికారు. ఆ తర్వాత బీజేపీ నేతల సమక్షంలోనే పలు అంశాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు. ఆ తర్వాత గంగూలీ ఇంట్లోనే ఆయనతో కలిసి అమిత్ షా డిన్నర్ […]
ఏపీలో కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయిలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్తగా వివాహం చేసుకుని అత్తింటికి వెళ్లే అమ్మాయిలకు ఇంటి పేరు మారుతుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే రాష్ట్రంలో చాలా మంది వివాహం చేసుకుని అత్తారింటికి వెళ్లే యువతులు తక్షణమే ఇంటి పేరు మార్చుకుని ప్రభుత్వ పథకాలకు అర్హులయ్యేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. యువతులు తమ పెళ్లి తర్వాత అత్తింటి తరఫున పేరు మార్చుకునేందుకు వీలుగా గ్రామ సచివాలయంలో […]