రూ.2,500 కోట్లు ఇస్తే సీఎం పదవి ఇప్పిస్తామంటూ కొందరు ఆఫర్ చేశారని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య మండిపడ్డారు. కర్ణాటక సీఎం పదవి వేలానికి పెట్టారా.. డబ్బులిస్తే చాలు.. ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేస్తారా అంటూ ఆయన నిలదీశారు. సీఎం సీటు ఏమైనా పేమెంట్ సీటా అని ప్రశ్నించారు. బసనగౌడ వ్యాఖ్యలపై తక్షణం దర్యాప్తు జరపాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. ఒకవేళ విచారణ జరపకుంటే బసవరాజ్ […]
పూణె వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ డకౌట్‌గా వెనుతిరిగాడు. అయితే మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ హాఫ్ సెంచరీతో రాణించాడు. డికాక్ 36 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో […]
ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా శనివారం నాడు విశాఖ జిల్లాలో పర్యటించారు. ఈ రోజు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా విశాఖలోని ఆర్కే బీచ్‌లో అల్లూరి విగ్రహానికి పూలమలలు వేసి ఆమె నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ.. అల్లూరి కేవలం 27 ఏళ్లే జీవించినా 27 తరాలు గుర్తుంచుకునేలా జీవించారని వ్యాఖ్యానించారు. అల్లూరి పేరు చెప్తేనే చాలా మంది రోమాలు […]
ఐపీఎల్‌లో శనివారం మధ్యాహ్నం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 41 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 68 పరుగులు చేశాడు. అతడికి మరో ఓపెనర్ జాస్ బట్లర్(30) మంచి సహకారం అందించాడు. […]
గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వైసీపీ ఆధ్వర్యంలో శనివారం నాడు జాబ్ మేళా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు ఈ జాబ్ మేళా జరగనుంది. ఈ మేరకు తొలిరోజు జాబ్ మేళా విజయవంతంగా ముగిసినట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. మొదటి రోజు 142 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొని 7,473 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆయన వివరించారు. మరో 1,562 మంది షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలిపారు. 373 మందికి వెంటనే ఆఫర్ లెటర్ ఇచ్చినట్లు […]
సాధారణంగా కొంతమంది ఉద్యోగులు ఆఫీసుల్లో నిద్రపోతూ ఉంటారు. ఒక్కోసారి నిద్ర కారణంగా బాస్‌ల చేత చీవాట్లు కూడా తినాల్సి ఉంటుంది. ఎందుకంటే వర్కింగ్ అవర్స్‌లో ఉద్యోగులు నిద్రపోవడాన్ని ఏ కంపెనీలు అంగీకరించవు. అయితే విదేశాల్లో కొన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులు నిద్రపోవడాన్ని అనుమతిస్తాయి. ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతిని మన దేశంలోని పలు కంపెనీలు కూడా ఆచరణలోకి తేవడం ప్రారంభించాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఉద్యోగులు ఆఫీసుల్లో నిద్రపోవచ్చని ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళ్తే.. […]
విశాఖలో జరిగిన వైసీపీ సమన్వయ కమిటీ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైసీపీ కార్యకర్తల ధైర్యం సీఎం జగన్మోహన్‌రెడ్డేనని స్పష్టం చేశారు. సీఎం జగన్ రాష్ట్రంలోని పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ఆమె తెలిపారు. వచ్చే ఎన్నికల్లో విశాఖలో వైసీపీ జెండా ఎగరేస్తామని.. విశాఖను తమ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని ఆమె వివరించారు. గతంలో విశాఖ ఎలా ఉందో. ఇప్పుడు విశాఖ […]
సాధారణంగా ఆర్టీసీ బస్సు ముందు భాగంలో ఐదు అడుగుల ఎత్తు వరకూ ఏమీ కనిపించదు. కొన్నిసార్లు ప్రయాణికులు, పాదచారులు బస్సు ముందు నుంచి వెళ్తుంటే.. ఎవరూ లేరని భావించి డ్రైవర్లు బస్సును ముందుకు పోనిస్తుంటారు. దీంతో ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో రావులపాలెం బస్టాండ్‌లోనే ఇదే తరహాలో రెండు ప్రమాదాలు జరగడంతో ఆయా బస్సులను నడిపిన డ్రైవర్లు ఆరు నెలల పాటు సస్పెండయ్యారు. అంతేకాకుండా బాధిత కుటుంబాలకు ఆర్టీసీ పరిహారం […]
వీకెండ్ సందర్భంగా శనివారం నాడు ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. తొలి మ్యాచ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఓపెనర్ జానీ బెయిర్ స్టో హాఫ్ సెంచరీతో రాణించాడు. 40 బంతుల్లో 8 ఫోర్లు, ఓ […]
విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో వైఎస్ఆర్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ భేటీకి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మంత్రి గుడివాడ అమర్నాథ్, మంత్రి విడదల రజనీ, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సహా వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, హాజరయ్యారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2014 నుంచి […]