గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వైసీపీ ఆధ్వర్యంలో శనివారం నాడు జాబ్ మేళా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు ఈ జాబ్ మేళా జరగనుంది. ఈ మేరకు తొలిరోజు జాబ్ మేళా విజయవంతంగా ముగిసినట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. మొదటి రోజు 142 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొని 7,473 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆయన వివరించారు. మరో 1,562 మంది షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలిపారు. 373 మందికి వెంటనే ఆఫర్ లెటర్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఏపీలో నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలన్న సీఎం జగన్ కల సాకారం కాబోతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. నిరుద్యోగ యువతకు బాసటగా వాళ్ళ ఇళ్లలో వెలుగు నింపుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రేపు కూడా జాబ్ మేళా కొనసాగుతుందని.. ఈరోజు 31వేల మంది యువత హాజరయ్యారని విజయసాయిరెడ్డి తెలిపారు. ఉద్యోగం రాని వాళ్లు నిరుత్సాహపడవద్దని.. ఉద్యోగం వచ్చే వరకూ వైసీపీ అండగా ఉంటుందన్నారు. పార్టీలో ఒక సెల్ ఏర్పాటు చేసి నిరుద్యోగుల జాబితా రూపొందించి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు కొనసాగుతాయన్నారు. జాబ్ మేళా విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన అందరికీ విజయసాయిరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఉద్యోగాలు పొందిన వాళ్లు రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
Sleeping in Office: బంపర్ ఆఫర్.. ఆఫీసులో రోజూ అరగంట నిద్రపోవచ్చు