ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్‌పై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిపై ప్రతిపక్షాలకు చెందిన కొందరు నేతలు దుర్భాషలాడుతూ అసభ్య పదజాలాలను వాడుతున్నారని.. ఇది మంచిది కాదని మంత్రి బొత్స హితవు పలికారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో వైసీపీ నేతలందరూ కలిసికట్టుగా ఉంటే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అధికారంలో లేనప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి దానిని కాపాడుకోవాల్సిన […]
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మరోసారి కరోనా వైరస్ కలకలం రేగింది. ఆ జట్టులోని ఓ నెట్ బౌలర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ జట్టు ఆటగాళ్లందరినీ ఐసోలేషన్‌లో ఉంచినట్లు నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఢిల్లీ జట్టులో ఇప్పటికే పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఆదివారం రాత్రి జరగాల్సిన మ్యాచ్‌పై సందిగ్ధత నెలకొంది. కాగా ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కరోనా సోకడం ఇది రెండోసారి. గతంలో […]
వంట గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగిన నేపథ్యంలో ప్రధాని మోదీ సర్కారుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ హయాంతో పోలిస్తే ప్రస్తుతం వంట గ్యాస్ ధరలు రెండింతలు అయ్యాయని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో వంట గ్యాస్ సిలిండర్ ధరలను ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వ పాలనలో ధరలతో పోల్చి చూపిస్తూ రాహూల్ గాంధీ ఓ ట్వీట్ చేశారు. 2014లో 14.2 కిలోల […]
కర్నూలు జిల్లా రైతు భరోసా యాత్రలో పవన్ కళ్యాణ్ పొత్తులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని.. కానీ ఏపీ భవిష్యత్ కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలని పవన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అంతిమంగా ప్రజలకే నష్టం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఉపయోగపడేలా పొత్తులు ఉండాలని.. పొత్తులపై చర్చలు అవసరమని.. పార్టీలు చాలా విశాల దృష్టితో ఆలోచించాలని పవన్ తెలిపారు. ఏపీ నిర్మాణానికి అన్ని పార్టీలు కృషి […]
2007లో టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత కెప్టెన్‌గా ఎంతో మంది సీనియర్లను కాదని బీసీసీఐ ధోనీని నియమించింది. ఎందుకంటే టీ20 ప్రపంచకప్‌కు సీనియర్లు దూరంగా ఉండటంతో యువరాజ్‌కు కెప్టెన్సీ ఇస్తారని అందరూ భావించారు. అయితే బీసీసీఐ అనూహ్యంగా ధోనీకి పగ్గాలు ఇవ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐపై టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు. 2007లో తాను కెప్టెన్ కావాల్సిందని.. కానీ అప్పుడు గ్రెగ్ ఛాపెల్ ఘటన జరిగిందని.. అది […]
వైసీపీ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ పాలనలో ఏపీ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులు నిద్రపట్టక పిచ్చివాగుడు వాగుతున్నారని.. దుర్మార్గులను బంగాళాఖాతంలో కలపాలంటే చంద్రబాబు పొత్తుల గుర్చి మాట్లాడుతున్నారని ఆరోపించడం దారుణమన్నారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటన విజయవంతమైందన్నారు. చంద్రబాబు పర్యటన విజయవంతం కావడంతో జగన్, వైసీపీ నేతలకు కింద తడవడం ప్రారంభమైందని విమర్శించారు. చంద్రబాబుకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి వైసీపీకి వెన్నులో వణుకు […]
ఐపీఎల్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘోర పరాజయం పాలైంది. పూణె వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో లక్నో 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 177 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కోల్‌కతా టీమ్ 101 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంద్రజిత్(0), ఫించ్(14), శ్రేయస్ అయ్యర్(6), నితీష్ రాణా(2), రింకూ సింగ్(6) విఫలమయ్యారు. ఆండ్రూ రస్సెల్ 19 బంతుల్లో 5 సిక్సులు, 3 ఫోర్లతో 45 పరుగులు చేసి అవుటయ్యాడు. […]
ఇంగ్లీష్ మీడియంపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి మాట్లాడే మాటలు ఇవ్వేనా అని చంద్రబాబును ఆమె ప్రశ్నించారు. ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మొద్దబ్బాయిల్లా మారతారని తమకు ఇప్పటివరకూ తెలియదన్నారు. అలా కూడా ఆలోచించవచ్చా అని ప్రతిపక్షనేత చెప్పే వరకు తనకు తెలియదని ఎద్దేవా చేశారు. పేదవాళ్లు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదా అని నిలదీశారు. కేవలం తన కుమారుడు మాత్రమే ఇంగ్లీష్ […]
మహేష్‌బాబు నటించిన సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్‌గూడలో ఘనంగా జరుగుతోంది. ఈ ఫంక్షన్‌కు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. దర్శకుడు పరశురాం తనకు రైటర్‌గా ఉన్నప్పటి నుంచి తెలుసని.. అతడు కష్టపడే విధానం తనను ఎంతో ఆకట్టుకుంటుందని తెలిపాడు. సర్కారు వారి పాట ట్రైలర్‌తోనే బ్లాక్ బస్టర్ హిట్ అనేలా పరశురాం ఈ సినిమాను తెరకెక్కించాడని వంశీ పైడిపల్లి ప్రశంసించాడు. గీత గోవిందం సినిమాతో […]