YV Subba Reddy: ఈనెల 11 నుంచి గడప గడపకు ‘వైఎస్ఆర్ కాంగ్రెస్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో వైఎస్ఆర్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ భేటీకి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మంత్రి గుడివాడ అమర్నాథ్, మంత్రి విడదల రజనీ, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సహా వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, హాజరయ్యారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు.
2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రజలకు గుర్తుచేయాలని వైసీపీ నేతలకు సూచించారు. చంద్రబాబు ఎన్నో అబద్దపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాడని.. పాదయాత్ర సందర్భంగా పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనను మించేలా జగన్ మోహన్ రెడ్డి పాలన సాగుతోందన్నారు. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి తలకిందులైందని.. అయినా ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని పారదర్శకతతో పథకాలు అమలు చేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. జగన్ సంక్షేమ పాలన చూసి ఓర్వలేక చంద్రబాబు, ఆయన కుమారుడు, పచ్చ మీడియా విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కరువు మేఘాలు తీసుకువస్తాడని వైవీ సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నెలరోజులకే హుద్ హుద్ తుఫాను వచ్చిందని గుర్తుచేశారు. ఇన్ని పథకాలు అమలు చేస్తున్నందుకు జగన్‌ను ఐరన్ లెగ్ అని ఆరోపిస్తారా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు జగన్ ప్రవేశపెట్టిన పథకాలు చంద్రబాబు ఆయన జీవితంలో ఎప్పుడైనా అమలు చేశారా అని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వంపై జరుగుతున్న విష ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలందరిపై ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వ పథకాల వల్ల జరుగుతున్న మేలును ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఈనెల 11వ తేదీ నుంచి గడప గడపకు కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. విశాఖ జిల్లాలో ఉన్న 6 స్థానాలు గెలవాలన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన ప్రతి కార్యకర్తకు మేలు జరుగుతుందని.. సమన్వయ కర్తగా ఇది తన బాధ్యత అని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.
Gudivada Amarnath: చంద్రబాబు, లోకేష్‌లను మించిన ఐరన్ లెగ్ లేరు
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!