ఏపీలో పొత్తులపై రాజకీయాలు వేడెక్కాయి. జనసేన, టీడీపీ పొత్తు అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబు ఎన్నికలంటే భయపడుతున్నారని.. కానీ ఎన్నికలంటే భయపడాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. గడిచిన మూడేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేసిందని అంబటి రాంబాబు గుర్తు చేశారు. టీడీపీ హయాంలో టీడీపీ చేసిందేమీ లేదు కాబట్టే తనతో పొత్తు పెట్టుకోవాలని అందరి కాళ్ల, వేళ్ల మీద చంద్రబాబు […]
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు, పవన్ మధ్య మొదట్నుంచి అక్రమ పొత్తులున్నాయని ఆయన ఆరోపించారు. చంద్రబాబు కూటమికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పవన్ రాజకీయ వ్యభిచారి అని.. బీజేపీ పక్కన ఉంటూ చంద్రబాబుకు సిగ్నల్ ఇస్తుంటే ఏం అంటారని జోగి రమేష్ ప్రశ్నించారు. టీడీపీ, జనసేన పొత్తుతో తమకు పోయేదేమీ లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎవరి వల్ల అందుతున్నాయో ప్రజలకు తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు […]
కర్నూలు జిల్లా సిరివెళ్లలో కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు విషయాలపై కులంకషంగా మాట్లాడారు. తాను కుల, మతాలకు అతీతంగా ఉంటానని.. ముస్లింలకు అండగా ఉంటానని పవన్ స్పష్టం చేశారు. ఇస్లాం టోపీలు పెట్టుకుని రాజకీయాలు చేసేవాడిని కాదని.. వైసీపీ వాళ్ల తరహాలో అలయ్ బలయ్ చేయలేనని ఎద్దేవా చేశారు. ముస్లింలు పనిచేసుకోవాలంటే ఇప్పుడు లంచం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఏ కులంలో పుట్టాలో మన చేతుల్లో లేదని.. మానవత్వం చూపే […]
గుంటూరు జిల్లా తాడికొండ సబ్‌స్టేషన్‌లో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అసని తుఫాన్ వల్ల ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ వైర్లు తెగిపడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వివరిస్తున్నారు. దీంతో సబ్‌స్టేషన్‌లో మంటలు భారీగా చెలరేగడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై తాడికొండ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు అసని తుఫాన్ కారణంగా ఏపీలోని పలు […]
సాధారణంగా క్రికెట్‌లో గోల్డెన్ డక్ అంటే అందరికీ తెలుసు.. కానీ డైమండ్ డక్ అంటే చాలా మందికి తెలియదు. అయితే ఆదివారం సన్‌రైజర్స్, ఆర్‌సీబీ మ్యాచ్ చూసిన వాళ్లకు డైమండ్ డక్ అంటే ఏంటో ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ డైమండ్ డక్ అయ్యాడు. ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే అవుటైతే దానిని డైమండ్ డక్ అంటారు. ఇన్నింగ్స్ తొలి బంతికే అభిషేక్ శర్మతో సమన్వయ లోపం కారణంగా విలియమ్సన్ ఖాతా […]
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యెం మండలంలో ఆదివారం నాడు ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక పొత్తు లేకుండా ఎన్నికలు వెళ్లిన దాఖలాలే లేవని ఆరోపించారు. గతంలో తెలంగాణలో కేసీఆర్‌తో కూడా పొత్తు పెట్టుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి గుర్తుచేశారు. కేవలం 2019 ఎన్నికల్లో మాత్రమే చంద్రబాబు ఒంటరిగా ఎన్నికలకు […]
అనంతపురం జిల్లాలో దళితుడి ఇల్లు కూల్చివేతను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుడి ఇల్లు కూల్చి ప్రభుత్వం ఏం సాధించిందని ప్రశ్నించారు. పేదవాడి ఇల్లు కూల్చివేతకు అంత మంది అధికారులు యుద్ధం చేస్తారా అంటూ నిలదీశారు. ఒక సామాన్య దళిత వ్యక్తి ఇంటిని కూల్చి కుటుంబాన్ని రోడ్డున పడేసేందుకు ఎమ్మెల్యే, ఆర్డీవో, పోలీసులు అధికారుల వరకు అంతా కలిసి యుద్దం చేయడంపై మండిపడ్డారు. అసలు జగన్ ప్రభుత్వానికి కూల్చడం తప్ప నిర్మించడం […]
కర్నూలు జిల్లా పర్యటనలో పవన్ కళ్యాణ్ కొత్తగా కనిపించారు. ఆయన చేతికి రెండు ఉంగరాలు ఉండటాన్ని గమనించి అందరూ ఆసక్తికరంగా చర్చించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రెండేళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని.. అందుకే ఈసారి ఆయన జ్యోతిష్యాన్ని నమ్ముకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఏపీలో పొత్తులపై కీలక చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో పవన్ చేతికి కొత్తగా రెండు ఉంగరాలు కనిపించడం.. అవి జెమ్ స్టోన్స్ పొదిగిన ఉంగరాలు కావడంతో […]
ఆగ్నేయ బంగాళాఖాతంలో అసని తుఫాన్ క్రమంగా బలపడుతోంది. విశాఖకు ఆగ్నేయంగా 970 కి.మీ. దూరంలో తుఫాన్ కేంద్రీకృతం అయ్యింది. రాగల ఆరు గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 10వ తేదీ నాటికి క్రమంగా ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చిన అనంతరం ఇది దిశ మార్చుకుంటుందని తెలిపింది. అనంతరం ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరం చేరే […]
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం మధ్యాహ్నం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ మరోసారి గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరిగాడు. అతడు ఈ టోర్నీలో గోల్డెన్ డకౌట్ కావడం ఇది మూడోసారి. అయితే మరో ఓపెనర్ డుప్లెసిస్ మాత్రం మెరుపు వేగంతో ఆడాడు. 50 […]