వీకెండ్ సందర్భంగా శనివారం నాడు ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. తొలి మ్యాచ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఓపెనర్ జానీ బెయిర్ స్టో హాఫ్ సెంచరీతో రాణించాడు. 40 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్ సహాయంతో 56 పరుగులు చేశాడు.
శిఖర్ ధావన్ 12, రాజపక్స 27, కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 15 పరుగులు చేశారు. బెయిర్‌స్టో అవుటైన తర్వాత జితేష్ శర్మ 18 బంతుల్లో 38 పరుగులు చేసి పంజాబ్ మంచి స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఆల్‌రౌండర్ లివింగ్ స్టోన్ 14 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 22 పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ 3 వికెట్లు తీయగా.. ప్రసిధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ సాధించారు. కాగా ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇరుజట్లకు ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం కీలకంగా మారింది.