ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం మధ్యాహ్నం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ మరోసారి గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరిగాడు. అతడు ఈ టోర్నీలో గోల్డెన్ డకౌట్ కావడం ఇది మూడోసారి. అయితే మరో ఓపెనర్ డుప్లెసిస్ మాత్రం మెరుపు వేగంతో ఆడాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 73 పరుగులతో చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు.
డుప్లెసిస్‌కు పటీదార్ (48) మంచి సహకారం అందించాడు. పటీదార్ 38 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సులతో 48 పరుగులు చేశాడు. మ్యాక్స్‌వెల్ 33 పరుగులు చేశాడు. చివర్లో దినేష్ కార్తీక్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 8 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు బాదడంతో 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో జగదీష సుచిత్‌కు రెండు వికెట్లు దక్కగా.. కార్తీక్ త్యాగి ఓ వికెట్ సాధించాడు. కాగా టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి ఆ తర్వాత ఐదు వరుస విజయాలతో ఆశలు రేకెత్తించిన సన్‌రైజర్స్ గత మూడు మ్యాచ్‌లలో వరుసగా ఓటమిపాలైంది. మరి ఈ మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదిస్తారా లేదా చతికిలపడతారో చూడాలి.