★ అసని తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఏపీలో నేడు జరగాల్సిన ఇంటర్ పరీక్ష ఈనెల 25కి వాయిదా వేసిన విద్యాశాఖ అధికారులు
★ ఏపీలో నేటి నుంచి వైసీపీ ఆధ్వర్యంలో గడప గడపకు కార్యక్రమం.. పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు
★ తిరుమల: నేడు రెండో రోజు పద్మావతి పరిణయోత్సవాలు.. ఈరోజు అశ్వ వాహనంపై ఊరేగనున్న శ్రీవారు.. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ
★ పల్నాడు జిల్లా: నేడు నర్సరావుపేటలో రైతు సమస్యలపై టీడీపీ ధర్నా
★ కర్నూలులో నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన.. బీజేపీ ఆఫీస్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్న సోమువీర్రాజు
★ నిజామాబాద్‌లో నేటి నుంచి సిటీ బస్సు సర్వీసులు.. సిటీ బస్సులను ప్రారంభించనున్న ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
★ ఐపీఎల్ 2022: నేడు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనున్న ఢిల్లీ క్యాపిటల్స్.. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్