Paper Leak Case: మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ టెన్త్ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో మంగళవారం నాడు నారాయణను ఏపీ సీఐడీ పోలీసులుహైదరాబాద్లో అరెస్ట్ చేసి అనంతరం చిత్తూరుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట నారాయణను హాజరుపరిచారు. అయితే పోలీసులు మోపిన అభియోగాన్ని మేజిస్ట్రేట్ కోర్టు తోసిపుచ్చింది. నారాయణ తరఫు లాయర్ల వాదనలతో కోర్టు ఏకీభవించింది.
2014లోనే నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి నారాయణ రాజీనామా చేసినట్లు లాయర్లు నిరూపించారు. దీంతో నారాయణకు వ్యక్తిగత పూచీకత్తుతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల చొప్పున ఇద్దరు జామీను ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. బెయిల్ మంజూరు చేసిన అనంతరం మాజీ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. నారాయణ విద్యాసంస్థల అధినేతగా తాను 2014లోనే తప్పుకున్నానని.. కానీ తాను నారాయణ సంస్థల అధినేతగానే ఉన్నానని పోలీసులు తనపై తప్పుడు అభియోగం మోపారని ఆరోపించారు. పేపర్ లీక్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు ఆధారాలు సమర్పించామన్నారు. తనపై మోపిన నేరారోపణ నమ్మేలా లేదన్న అభిప్రాయానికి వచ్చిన కోర్టు బెయిలు మంజూరు చేసినట్టు నారాయణ పేర్కొన్నారు.
Also Read
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..