టాలీవుడ్ హీరోలలో మార్పు వస్తోందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం రావటం లేదు. ఇటీవల కాలంలో టాలీవుడ్ ఎప్పుడూ లేనంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా టాలీవుడ్ వెలిగిపోతోందనే కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ అదంతా మేడిపండు చందం అని కొట్టి పడేస్తున్నారు అనుభవజ్ఞులు. అసలేం జరుగుతోంది అంటే టాలీవుడ్‌లో ప్రస్తుతం అన్ని సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్స్ అనే నగ్నసత్యాన్ని బయటపెడుతున్నాయి. సూపర్ డూపర్ హిట్ అంటూ ఢంకా బజాయించి చెవులు హోరెత్తిస్తున్న సినిమాలు సైతం రియల్‌గా బాక్సాఫీస్ వద్ద […]
కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మళ్లీ యాక్టివ్ అయ్యారు. సోమవారం నాడు విశాఖ నార్త్ నియోజకవర్గంలో టీడీపీ మహిళా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ జాతీయ అధ్యక్షుడి స్థాయి నుంచి బూత్ లెవల్ వరకు పటిష్టంగా ఉందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. వాలంటీర్ల […]
విజయవాడ కమిషనరేట్ పరిధిలో నలుగురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ క్రాంతిరాణా టాటా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సత్యానందంను పటమట పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. అటు కమిషనరేట్‌లో ఉన్న ఎంవీ దుర్గారావును కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. పటమట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సురేష్ రెడ్డిని సిటీ టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి బదిలీ చేశారు. సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న […]
ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో ఎంతో ఆసక్తి రేపిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. పాకిస్థాన్‌పై భారత్ చివరి వరకు దూకుడుగా ప్రదర్శించింది. ఫస్ట్ హాఫ్‌లో భారత ప్లేయర్ కార్తీ సెల్వమ్ తొలి గోల్ చేసి భారత్‌ను 1-0 లీడ్‌లోకి తీసుకెళ్లాడు. సెకండ్ హాఫ్‌లోనూ భారత్ ఆధిక్యంలో ఉండగా మ్యాచ్ ఒక్క నిమిషంలో ముగుస్తుందనగా పాక్ ఆటగాడు అబ్దుల్ రాణా గోల్ కొట్టి స్కోర్‌ను 1-1తో సమం చేశాడు. దీంతో దాయాది దేశాల మధ్య జరిగిన మ్యాచ్ […]
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ అలియాస్ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్ చేసిన అనంతరం రహస్య ప్రదేశంలో పోలీసులు అనంతబాబును విచారించారు. విచారణలో భాగంగా ఆయనకు కాకినాడ జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. కాకినాడ జిల్లా కోర్టుకు వేసవి సెలవులు కావడంతో స్పెషల్ మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జడ్జి చల్లా జానకి ముందు అనంత […]
సీఎం జగన్ దావోస్ పర్యటనలో రెండో రోజు బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా పలు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానితో జగన్ సమావేశమై కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో పెట్టబడులు పెట్టాలని జగన్ రిక్వెస్ట్ చేయగా.. గుర్నాని సానుకూలంగా స్పందించారు. టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ బైట్.#APatWEF22 #AndhraPradesh #CMYSJaganInDavos pic.twitter.com/zv8F17pB8l — YSR Congress Party (@YSRCParty) May 23, 2022 […]
ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి మేరుగ నాగార్జునపై టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి మేరుగ నాగార్జున పేరు చివర రెడ్డి అనే పదం కనిపించడంపై ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంత్రి మేరుగ నాగార్జున తాను దళిత బిడ్డ అన్న విషయాన్ని మరిచిపోయినట్లు ఉన్నారని వంగలపూడి అనిత సెటైర్ వేశారు. దళితుల మీదే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ […]
శ్యామ్ సింగరాయ్ వంటి హిట్ మూవీ తర్వాత నేచురల్ స్టార్ నాని నటిస్తున్న కొత్త చిత్రం ‘అంటే సుందరానికి’. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఆయన శ్రీవిష్ణుతో మెంటల్ మదిలో, బ్రోచెవారెవరురా వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆ రెండు సినిమాలు వివేక్ ఆత్రేయకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దీంతో అతడికి నాని అవకాశమిచ్చాడు. ‘అంటే సుందరానికి’ సినిమాను ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. […]
ఏపీలో ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ వ్యవహారం వైసీపీని ఇరుకున పెడుతోంది. తాను డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు పోలీసుల కస్టడీలో ఎమ్మెల్సీ నేరాన్ని అంగీకరించాడు. దీంతో వైసీపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు వైసీపీపై విరుచుకుపడుతున్న తరుణంలో మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆయన స్పష్టం చేశారు. దావోస్‌లో ఉన్న సీఎం జగన్ కూడా ఎమ్మెల్సీపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. తప్పు చేస్తే ఎమ్మెల్సీ అయినా చర్యలు […]
ఏపీ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కారులో డెడ్‌బాడీ దొరికిన అంశం హాట్ టాపిక్‌గా మారింది. నిందితుడు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కావడంతో ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే చట్టం ముందు అందరూ సమానులేనని.. తప్పు చేసింది ఎమ్మెల్సీ అయినా చర్యలు తప్పవని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని వైసీపీ మంత్రులు క్లారిటీ ఇస్తున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇప్పటికే ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన […]