ఆస్ట్రేలియాలో ఇటీవల ఫెడరల్ ఎన్నికల్లో వందలాది మంది అర్ధనగ్నంగా పాల్గొనడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా మహిళలు స్విమ్‌సూట్ ధరించగా.. పురుషులు అండర్‌వేర్‌లో వెళ్లి ఎన్నికల్లో పాల్గొన్నారు. అయితే మహిళలు, పురుషులు ఇలా అర్ధనగ్నంగా ఎన్నికల్లో పాల్గొనడానికి ఓ కారణముంది. ‘బడ్జీ స్మగ్లర్స్’ అనే బట్టల కంపెనీ అక్కడి ఓటర్లకు ఓ ఆఫర్ ప్రకటించింది. అండర్‌వేర్‌లో వెళ్లి ఓటేస్తూ ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తే బ్రాండెడ్ స్విమ్వేర్ను ఉచితంగా ఇస్తామని తెలిపింది. […]
పార్టీ ఏదైనా.. నియోజకవర్గం ఏదైనా.. గెలుపుపై గ్యారంటీ ఉన్న రాజకీయ నేత ఎవరైనా ఉన్నారా అంటే అది గంటా శ్రీనివాసరావు మాత్రమే. ఎన్నికల్లో ఆయన ఏ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినా.. ఏ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసినా గెలుపు సొంతం చేసుకుంటారు. వైసీపీ ప్రభంజనం సృష్టించిన 2019 ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల తర్వాత గంటా […]
దొంగల్లో పలు రకాలు ఉంటారు. ఒకరు డబ్బులు దొంగతనం చేస్తే.. మరొకరు నగలు చోరీ చేస్తుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం బట్టల దుకాణంలో బట్టలు దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు రిలయన్స్ ట్రెండ్స్‌లో మంగళవారం నాడు చోరీ జరిగింది. బట్టలు దొంగతనం చేస్తూ ఓ వ్యక్తి సీసీ కెమెరాకు చిక్కాడు. దీంతో రిలయన్స్ విజిలెన్స్ విభాగం అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి పాల్పడిన వ్యక్తి మక్కువ […]
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ విధ్వంసం సృష్టించాడు. మిగతా ఆటగాళ్లు త్వరగా ఔటైనా బట్లర్ ఒక్కడే నిలబడ్డాడు. 56 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి చివర్లో ఔట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ ఆరు వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ […]
తెలంగాణలో వాతావరణం మళ్లీ వేడెక్కింది. ఇటీవల కొన్నిరోజులు చల్లబడిన వాతావరణం భానుడి ప్రతాపం మళ్లీ సెగలు కక్కుతోంది. దీంతో బయటకు రావాలంటే ప్రజలు అవస్థలు పడుతున్నారు. వడగాల్పుల తీవ్రత కూడా ఉండటంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. మంగళవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయుడుపేటలో అత్యధికంగా 44.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ఖమ్మం జిల్లా మధిరలో 43.9 డిగ్రీల సెల్సియస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లెగోరిలో 43.8 డిగ్రీల సెల్సియస్, మహబూబాబాద్ జిల్లా గార్లలో […]
కోనసీమ జిల్లా మార్పుపై అమలాపురంలో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోనసీమ సాధన సమితి మరో నిరసనకు పిలుపునిచ్చింది. బుధవారం ఉదయం 10 గంటలకు అమలాపురం కలెక్టరేట్ సమీపంలోని నల్ల వంతెన వద్దకు భారీగా ప్రజలు చేరుకోవాలని, నిరసన చేపట్టాలని తెలిపింది. దీంతో బుధవారం ఏం జరుగుతుందనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అమలాపురంలో నిరసనకారులు మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌బాబు ఇళ్లకు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. అటు […]
దేశీయ స్టాక్ మార్కెట్ బిగ్‌బుల్ రాకేష్ ఝున్‌ఝున్ వాలా విమానయాన రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రజలకు తక్కువ ఖర్చుకే విమాన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ‘ఆకాశ’ విమానయాన సంస్థను ఝున్‌ఝున్ వాలా ప్రకటించారు. విమానయాన రంగంలో రూ.262 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు పేర్కొన్నారు. కాగా వచ్చే నెలలో ఆకాశ విమానాలు టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఆకాశ విమానాలకు సంబంధించిన ఫోటోలను కంపెనీ షేర్ చేసింది. ఆకాశ ఎయిర్‌లైన్స్ సంస్థ జూన్‌లో ముంబైలో తన […]
కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడంతో అమలాపురం అట్టడుకుతోంది. ఈ అంశంపై పెద్ద ఎత్తున ఆందోళనకారులు నిరసనలకు దిగడంతో ఎస్పీ ఆధ్వర్యంలో అమలాపురం చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు చేస్తుండటంతో నిరసనకారులు రెచ్చిపోయారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈక్రమంలోనే మొత్తం ఐదు బస్సులు, పోలీసు వాహనాలకు ఆందోళనకారులు నిప్పంటించారు. తర్వాత నిరసనకారులు మంత్రి విశ్వరూప్ ఇంటిని, ఆవరణలో ఉన్న కార్లను తగులబెట్టారు. దీంతో అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఆందోళనకారులు తన […]
టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. ఇటీవల ఐపీఎల్‌లో అరంగేట్రం విషయంలో ముంబై ఇండియన్స్ జట్టు మొండిచేయి చూపగా.. తాజాగా రంజీ నాకౌట్ మ్యాచ్‌ల కోసం ఎంపిక చేసిన ముంబై జట్టులోనూ అర్జున్ టెండూల్కర్‌కు చోటు దక్కలేదు. దీంతో అతడి క్రికెట్ కెరీర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇంతవరకు అరంగేట్రం చేయని అర్జున్ టెండూల్కర్‌ను రంజీలలో ఆడిస్తారని అందరూ ఆశించారు. దీంతో జూన్ నుంచి మొదలు […]
రాజస్థాన్ రాయల్స్ జట్టుపై టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ విషయంలో రాజస్థాన్ జట్టు వ్యూహాలను భజ్జీ మెచ్చుకున్నాడు. గతంలో ఏ జట్టు కూడా అశ్విన్‌ను ఉపయోగించుకోని రీతిలో రాజస్థాన్ జట్టు వాడుకుందని హర్భజన్ గుర్తుచేశాడు. అశ్విన్ ఆల్ రౌండర్ సామర్థ్యాలపై విశ్వాసం చూపినందుకు ప్రతిఫలంగా ఆ జట్టు ఎంతో మేలు పొందిందని కూడా తెలిపాడు. రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరడంలో బట్లర్‌తో పాటు అశ్విన్‌కు కూడా […]