విజయవాడ కమిషనరేట్ పరిధిలో నలుగురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ క్రాంతిరాణా టాటా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సత్యానందంను పటమట పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. అటు కమిషనరేట్‌లో ఉన్న ఎంవీ దుర్గారావును కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. పటమట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సురేష్ రెడ్డిని సిటీ టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి బదిలీ చేశారు. సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న నాగ శ్రీనివాస్‌ను సిటీ టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి బదిలీ చేస్తూ సీపీ క్రాంతిరాణా టాటా ఉత్తర్వులు జారీ చేశారు.