కోనసీమ జిల్లా మార్పు ప్రభుత్వానికి కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టింది. కోనసీమ జిల్లా పేరును ప్రభుత్వం ఇటీవల డా.బీఆర్ అంబేద్కర్ జిల్లాగా మార్చడం కొంతమందికి ఆగ్రహాన్ని తెప్పించింది. అయితే కోనసీమ జిల్లాగానే పేరును కొనసాగించాలని మళ్లీ డిమాండ్లు ఊపందుకున్నాయి. దీంతో అమలాపురంలో హైటెన్షన్ నెలకొంది. జిల్లా పేరు మార్పుపై జరిగే ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు 144 సెక్షన్ విధించినా లాభం లేకపోయింది. Undavalli: ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు.. పోలవరం ఎప్పటికీ పూర్తి కాదు..! పోలీసులు ఎటువంటి సమావేశాలు, […]
నేషనల్ హైవేపై ప్రయాణించే సమయంలో అత్యంత ఇబ్బందికరమైన విషయం ఏమైనా ఉంటుందంటే అది టోల్ ప్లాజాల దగ్గర నిరీక్షించడమే. అయితే టోల్ ప్లాజా ఫీజుల విషయంలో కేంద్ర ప్రభుత్వం గత ఏడాది కొత్త నిబంధన తీసుకొచ్చింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ లేకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిబంధన తీసుకొచ్చింది. అది ఏంటంటే.. వాహనదారులు 10 సెకన్‌ల కంటే ఎక్కువ సేపు నిరీక్షిస్తే టోల్ పన్ను కట్టాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది […]
ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు ఉన్నారు. వరల్డ్‌లోనే బెస్ట్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, డివిలియర్స్, మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉండటంతో ఆ జట్టుకు క్రేజ్ విపరీతంగా ఉంటోంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా ఆ జట్టుకు క్రేజ్ అయితే తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటున్న టాప్-3 క్రీడా జట్టుల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌కు చోటు దక్కింది. ఏప్రిల్ 2022లో […]
తమిళనాడులోని ఓరథనాడు ప్రాంతంలో ఓ ఇంట్లో పెళ్లికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగాయి. ఈ శుభకార్యం కోసం బంధువులు, స్నేహితులంతా తరలివచ్చారు. దీంతో సదరు కుటుంబం అతిథులకు మటన్ బిర్యానీతో డిన్నర్ ఏర్పాటు చేశారు. పెళ్లితంతు అంతా సవ్యంగానే జరిగింది. అయితే ఒక్కసారిగా పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మటన్ బిర్యానీ లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పడంతో అక్కడున్న వారు అవాక్కయ్యారు. అయితే ఇదంతా జొమాటో నిర్లక్ష్యంతోనే జరిగిందని కుటుంబ సభ్యులు […]
పంజాబ్‌లో ఇటీవలే ఆప్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ మేరకు కొత్త కేబినెట్‌లో ఆప్ నేత విజయ్ సింఘ్లాకు ఆరోగ్య శాఖను సీఎం భగవంత్ మాన్‌సింగ్ కట్టబెట్టారు. అయితే రెండు నెలలు తిరగకముందే మంత్రి పదవిని విజయ్ సింఘ్లా దుర్వినియోగం చేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆరోగ్య శాఖకు సంబంధించి వివిధ కాంట్రాక్టుల కోసం మంత్రి విజయ్ సింఘ్లా ఒక శాతం కమిషన్ అడుగుతున్నారని ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సీఎం భగవంత్ […]
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు వెల్లడించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబే హత్య చేసినట్లు ఆయన తెలిపారు. ఈనెల 19న డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇంట్లో నుంచి బయటకు వచ్చాడని.. శ్రీరామ్‌నగర్‌లో మిత్రులతో కలిసి రాత్రివేళ సుబ్రహ్మణ్యం మద్యం సేవించాడని ఎస్పీ వివరించారు. అదే సమయంలో ఆ ప్రాంతానికి ఎమ్మెల్సీ అనంతబాబు వెళ్లి సుబ్రహ్మణ్యాన్ని తన కారులో తీసుకెళ్లారని చెప్పారు. సుబ్రహ్మణ్యం […]
దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ ప్రభుత్వం పలు కంపెనీలతో కీలక పారిశ్రామిక ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ మేరకు జగన్ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమై ఎంవోయూలను కుదుర్చుకుంటున్నారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీ కోసం భారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది. ఈ మేరకు రూ.60 వేల కోట్లు భారీ పెట్టుబడి పెట్టడానికి అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ ముందుకు వచ్చింది. Jagan Davos Tour: టెక్ మహింద్రాతో ఏపీ ప్రభుత్వం […]
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ మళ్లీ కలుసుకున్నారు. ఈ మేరకు వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పవన్, రేణుదేశాయ్ దంపతుల తనయుడు అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా సోమవారం ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నగరంలోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూలులో అకీరా గ్రాడ్యుయేషన్ డే ఘనంగా జరిగినట్లు ఫోటోలను చూస్తే తెలుస్తోంది. Tollywood: హీరోల్లో మార్పు వస్తుందా..? బడ్జెట్స్ తగ్గుతాయా..? అకీరా […]
యాంగ్రీమెన్ రాజశేఖర్ హీరోగా నటించిన ‘శేఖర్’ సినిమా టీమ్‌కు గుడ్ న్యూస్ అందింది. హీరో రాజశేఖర్ తనకు డబ్బు ఇవ్వాలని ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన పిటిషన్‌ను సోమవారం నాడు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కొట్టివేసింది. దీంతో పాటు శేఖర్ సినిమా ప్రదర్శనకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తామెప్పుడూ చెప్పలేదని కోర్టు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. Tollywood: హీరోల్లో మార్పు వస్తుందా..? బడ్జెట్స్ తగ్గుతాయా..? కొంతమంది ఉద్దేశపూర్వకంగా శేఖర్ సినిమా ప్రదర్శనకు […]