Jagan Davos Tour: టెక్ మహింద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం జగన్ దావోస్ పర్యటనలో రెండో రోజు బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా పలు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానితో జగన్ సమావేశమై కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో పెట్టబడులు పెట్టాలని జగన్ రిక్వెస్ట్ చేయగా.. గుర్నాని సానుకూలంగా స్పందించారు.
టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ బైట్.#APatWEF22 #AndhraPradesh #CMYSJaganInDavos pic.twitter.com/zv8F17pB8l
Also Read
- AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
- OTR: జగన్ నో కాంప్రమైజ్.. కానీ అనంతపురం నేతల కొత్త గేమ్ ఏంటి?
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
— YSR Congress Party (@YSRCParty) May 23, 2022
విశాఖను మేజర్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలని సీఎం జగన్ సంకల్పంతో ఉన్నారని టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో గుర్నాని వివరించారు. నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారని ఆయన తెలిపారు. నైపుణ్యాలను పెంచేందుకు, హైఎండ్ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో యూనివర్శిటీతో కలిసి ప్రత్యేక పాఠ్యప్రణాళికను రూపొందిస్తామని పేర్కొన్నారు. ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్‌కు ప్రధాన కేంద్రంగా విశాఖపట్నాన్ని తీర్చిద్దాలని శ్రమిస్తున్నారని.. ఈ కల సాకారానికి ఏపీతో కలిసి రావాలని ఆహ్వానించారన్నారు.

మరోవైపు దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్‌తో సీఎం జగన్ సమావేశమై ఏపీలో పెట్టుబడుల విషయంపై వివరించారు. మరోవైపు స్విస్ పార్లమెంటు ప్రతినిధి బృందంతో సీఎం జగన్ సమావేశమయ్యారు. భారత సంతతికి చెందిన స్విస్ ఎంపీ నిక్లాజ్ శామ్యూల్ గుగెర్ బృందంతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఏపీలో వ్యాపార అవకాశాలపై సీఎం జగన్‌తో స్విస్ పార్లమెంట్ ప్రతినిధి బృందం చర్చించింది.
స్విస్ పార్లమెంటు ప్రతినిధి బృందంతో సీఎం శ్రీ వైయస్.జగన్ భేటీ.
భారత సంతతికి చెందిన స్విస్ ఎంపీ నిక్లాజ్ శామ్యూల్ గుగెర్ బృందంతో సీఎం సమావేశం.
ఏపీలో వ్యాపార అవకాశాలపై ముఖ్యమంత్రితో చర్చించిన బృందం.#CMYSJaganInDavos #APatWEF22 #AndhraPradesh pic.twitter.com/9b0VJoewvL— YSR Congress Party (@YSRCParty) May 23, 2022
మరోవైపు ఓఎస్‌కే లైన్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈవో తకీషి హషిమొటోతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తకీషి హషిమొటోతో మాట్లాడుతూ.. షిప్పింగ్, లాజిస్టిక్స్ వ్యాపార రంగానికి సంబంధించి ఏపీలో ఉన్న అవకాశాలపై చర్చించామన్నారు. ఏపీకి గొప్ప అవకాశాలున్నాయని.. తమ వ్యాపారాన్ని విస్తరించడానికి తమకూ అవకాశం కలుగుతోందని అభిప్రాయపడ్డారు. తాము భారత్‌లో పూర్తిస్థాయి కంపెనీని పెట్టామని.. ఏపీలో ఈ కంపెనీ ద్వారా వ్యాపారాన్ని విస్తరిస్తామని తెలిపారు. ఏపీకి పొడవైన తీరప్రాంతం ఉందని.. కొత్తగా నిర్మించే నాలుగు పోర్టుల ద్వారా ఈ రంగంలో వ్యాపార అవకాశాలు మరింత పెరుగుతాయని తకీషి హషిమొటో వివరించారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!