Ambati Rambabu: తప్పు చేస్తే ఎమ్మెల్సీ అయినా చర్యలు తప్పవు..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ వ్యవహారం వైసీపీని ఇరుకున పెడుతోంది. తాను డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు పోలీసుల కస్టడీలో ఎమ్మెల్సీ నేరాన్ని అంగీకరించాడు. దీంతో వైసీపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు వైసీపీపై విరుచుకుపడుతున్న తరుణంలో మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆయన స్పష్టం చేశారు. దావోస్‌లో ఉన్న సీఎం జగన్ కూడా ఎమ్మెల్సీపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. తప్పు చేస్తే ఎమ్మెల్సీ అయినా చర్యలు తప్పవని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.
MLC Anantha Babu: సుబ్రహ్మణ్యం బ్లాక్‌మెయిల్ చేశాడు.. అందుకే..!!
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
- Nara Lokesh: అక్షర ఆంధ్రకు నారా లోకేష్ కొత్త టార్గెట్.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత
- AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
మరోవైపు టీడీపీ నేత నారా లోకేష్‌పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. లోకేష్ ఏం పీకారని అడుగుతున్నాడని.. అలా అనడం తప్పు అని.. ఆయన దగ్గర ఏం ఉందని పీకడానికి అని అంబటి రాంబాబు చురకలంటించారు. లోకేష్‌కు పొట్టకొస్తే అక్షరం ముక్క రాదని.. అమెరికా వెళ్లి చదువుకున్నాడో లేదా స్విమ్మింగ్ పూల్‌లో అమ్మాయిలతో బీర్ తాగుతూ తిరిగాడో తెలియదని ఎద్దేవా చేశారు. లోకేష్ పక్కన తిరిగేవాళ్లే టీడీపీ పనిఅయిపోయిందని అభిప్రాయపడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. తన గురించి లోకేష్ పిచ్చిపిచ్చిగా వాగుతున్నాడని.. తాను తిరిగి మాట్లాడితే ఆయన ఇంటిల్లిపాదీ మీడియా ముందు ఏడుస్తూ కూర్చుంటారని విమర్శించారు. లోకేష్ ఓ మాలోకం అని.. బడుద్దాయి అని.. సంచులు మోసే సన్నాసి అని మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాగా జగన్ పనితీరు చూసి ప్రతిపక్షాలకు భయం పట్టుకుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జగన్‌ను సింగిల్‌గా ఢీ కొట్టలేక టీడీపీ పవన్ కళ్యాణ్, బీజేపీని వెంటతెచ్చుకునే తంటాలు పడుతోందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని మరోసారి ప్రజలు చిత్తు చేయడం ఖాయమన్నారు. వైసీపీని ప్రజలు మళ్ళీ గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీది ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం కాదని.. జగన్ పాలన చూసి ‘ఏడుపే ఏడుపు’ కార్యక్రమం అని ఆరోపించారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!