ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో ఎంతో ఆసక్తి రేపిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. పాకిస్థాన్‌పై భారత్ చివరి వరకు దూకుడుగా ప్రదర్శించింది. ఫస్ట్ హాఫ్‌లో భారత ప్లేయర్ కార్తీ సెల్వమ్ తొలి గోల్ చేసి భారత్‌ను 1-0 లీడ్‌లోకి తీసుకెళ్లాడు. సెకండ్ హాఫ్‌లోనూ భారత్ ఆధిక్యంలో ఉండగా మ్యాచ్ ఒక్క నిమిషంలో ముగుస్తుందనగా పాక్ ఆటగాడు అబ్దుల్ రాణా గోల్ కొట్టి స్కోర్‌ను 1-1తో సమం చేశాడు. దీంతో దాయాది దేశాల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది.
కాగా గతంలో 2017లో ఆసియా కప్ హాకీ టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. ఈ సారి కూడా ఈ కప్‌ను గెలవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. భారత్, పాకిస్థాన్ జట్లు గతంలో మూడేసి సార్లు ఆసియా కప్ హాకీ టైటిల్‌ను కైవసం చేసుకున్నాయి. క్రికెట్ తరహాలోనే భారత్, పాకిస్తాన్‌లలో హాకీని కూడా చాలా మంది ఆదరిస్తుంటారు. అందుకే క్రికెట్‌తో పాటు హాకీ గేమ్‌ను కూడా దేశ భక్తితో ముడిపెడుతుంటారు. అటు గత ఏడాది జరిగిన ఒలింపిక్స్‌లో భారత పురుషుల జట్టు పతకాన్ని కూడా సాధించిన సంగతి తెలిసిందే.