ఈనెల 25న భారత్ బంద్‌కు ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. కుల ఆధారిత ఓబీసీ జనగణనను కేంద్రం నిర్వహించకపోవడానికి నిరసనగా పలు డిమాండ్లతో భారత్ బంద్‌కు ఫెడరేషన్ పిలుపు ఇచ్చినట్లు బహుజన్ ముక్తి పార్టీ షహరాన్‌పూర్ జిల్లా అధ్యక్షుడు నీరజ్ ధిమాన్ వెల్లడించారు. కేంద్రం కులాల ఆధారంగా ఓబీసీ జనాభా గణన చేపట్టకపోవడం, ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకపోవడం, ఎన్నికల్లో ఈవీఎంల కుంభకోణం వంటి […]
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సుకు సీఎం జగన్ హాజరయ్యారు. ఆయనతో పాటు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. తొలిరోజు పలువురు పారిశ్రామిక వేత్తలతో జగన్ సమావేశమై ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. తొలుత ఈ సదస్సులో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేశారు. ఏపీ పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను జగన్ పరిశీలించారు. అనంతరం డబ్ల్యూఈఎఫ్ హెల్త్ విభాగం అధిపతి శ్యాం […]
సినీ సంగీత ప్రపంచంలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సింగర్ సంగీత సజిత్ (46) కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆదివారం తిరువనంతపురంలోని తన సోదరి నివాసంలో కన్నుమూశారు. సంగీత కొద్దిరోజులుగా తన సోదరి వద్ద చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం మరణించినట్లు కుటుంబీకులు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన 46 ఏళ్ల సంగీత సజిత్ తమిళ్, కన్నడ, తెలుగు భాషా చిత్రాల్లో సుమారు 200 పాటలు పాడారు. Mitraaw Sharma: ‘బిగ్‌బాస్’ నాకు అది […]
పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. రాష్ట్రంలో తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. దేశంలోనే అత్యధికంగా ఏపీలోనే వ్యాట్ ట్యాక్స్ వసూలు చేస్తున్నట్లు లోకేష్ ఆరోపించారు. ఇకనైనా వ్యాట్ తగ్గించి బాదుడే బాదుడిని ఆపాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై భారాలు తగ్గిస్తుంటే ఏపీలో ఒక్కసారి […]
ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు వెళ్లినా ప్రారంభంలో ముఖేష్ యాడ్ కనిపించాల్సిందే. ధూమపానం, మద్యపానం గురించి ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఈ ప్రకటనను సినిమాకు ముందు ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే సినిమాల్లో నటులు పాత్రల స్వభావాన్ని బట్టి సిగరెట్ తాగుతూ మద్యపానం చేస్తూ కనిపించాల్సి వస్తుంది. వారిని ప్రజలు ఆదర్శంగా తీసుకునే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రభుత్వం ముందస్తుగా ముఖేష్ యాడ్‌ను చూపించాలనే నిబంధనను విధించింది. అయితే F3 సినిమాకు ముఖేష్ యాడ్ గోల కనిపించదు. Shekar […]
భారత్‌లోని ప్రభుత్వ రంగ బ్యాంకులలో అతి పెద్ద సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే ప్రస్తుతం ఎస్‌బీఐ కస్టమర్ల ఫోన్‌లకు ఓ ఫేక్ మెసేజ్ సర్క్యులేట్ అవుతోంది. మీ ఎస్‌బీఐ ఖాతాను బ్లాక్ చేశారని.. సంబంధిత వివరాలతో మళ్లీ మీ ఖాతాను పునరుద్ధరించుకోవాలని మెసేజ్‌తో పాటు ఓ లింకు కూడా దర్శనమిస్తోంది. ఈ మెసేజ్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఇది ఫేక్ మెసేజ్ అని.. ఈ మెసేజ్ పట్ల ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర […]
దక్షిణాఫ్రికాతో జూన్ 9 నుంచి సొంతగడ్డపై జరగనున్న ఐదు టీ20ల సిరీస్ కోసం సెలక్టర్లు భారత జట్టును ప్రకటించారు. ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చారు. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ను సెలక్టర్లు ప్రకటించారు. ఐపీఎల్‌లో ఆకట్టుకున్న ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా, వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌లకు చాలాకాలం తర్వాత టీమిండియాలో స్థానం లభించింది. హార్డిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడంతో […]
బ్రిటన్‌లోని శ్రీమంతుల జాబితాపై సండే టైమ్స్ అనే సంస్థ ఈ ఏడాది సర్వే చేసి 250 మంది పేర్లను ప్రకటించింది. అయితే ఈ జాబితాలో బ్రిటన్ ఆర్థిక మంత్రి, భారత్‌కు చెందిన రిషి సునాక్, ఆయన భార్య అక్షతామూర్తి 222వ స్థానంలో నిలిచారు. ఈ దంపతుల ఆస్తుల విలువ రూ.7074 కోట్లుగా సండేటైమ్స్ ప్రకటించింది. గత 34 ఏళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్‌లోని శ్రీమంతుల జాబితాను సండే టైమ్స్ ప్రతి ఏడాది విడుదల చేస్తోంది. అయితే తొలిసారి ఈ […]
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం హర్షణీయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా ఓ లేఖ విడుదల చేశారు. రోజురోజుకీ పెరుగుతున్న ధరలతో బెంబేలెత్తుతున్న ప్రజలకు పెట్రోలు, డీజిల్ రేట్ల తగ్గింపు ఉపశమనం ఇస్తుందని పవన్ తన లేఖలో అభిప్రాయపడ్డారు. నిత్యావసర ధరల పెరుగుదలకు ఇంధన రేట్లే కారణమని.. బీజేపీ ప్రభుత్వ నిర్ణయంతో నిత్యావసరాల ధరలు కొంత వరకు తగ్గే అవకాశం ఉందన్నారు. పీఎమ్ ఉజ్వల యోజన పథకంలో అందించే గ్యాస్ సిలిండర్లపై […]
యాంగ్రీమెన్ రాజశేఖర్ నటించిన ‘శేఖర్’ సినిమాకు ఎదురుదెబ్బ తగిలింది. హీరో రాజశేఖర్ తనకు డబ్బు ఇవ్వాలని ఫైనాన్షియర్ పరంధామరెడ్డి హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు కోర్టు ఆదేశించినా రాజశేఖర్ డబ్బు చెల్లించకపోవడంతో ఆయన నటించిన ‘శేఖర్’ ప్రదర్శన నిలిపివేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. శాటిలైట్, ఓటీటీ, యూట్యూబ్‌లోనూ ప్రసారం చేయరాదని కోర్టు పేర్కొంది. దీంతో పలుచోట్ల శేఖర్ సినిమా ప్రదర్శన నిలిచిపోయింది. Lokesh Kanagaraj: ఆ స్టార్ హీరోతో సినిమా కన్ఫమ్ […]