బండి .. బండి రైలు బండి.. వేళకంటూ రాదులేండి.. దీన్ని గాని నమ్మూకుంటే ఇంతేనండీ.. ఇంతేనండీ.. నితిన్ నటించిన ‘జయం’ సినిమాలోని పాట మీకు గుర్తుందా? దేశంలోని రైళ్లు ఎప్పుడూ సరైన సమయానికి రావనే అపవాదు ఉంది. అందుకే సినిమాల్లో కూడా పాట రూపంలో ఈ విషయాన్ని పొందుపరిచారు. అయితే ఈ అపవాదను పోగొట్టుకోవడానికి రైల్వేశాఖ కృషి చేస్తూనే ఉంది. ఈ క్రమంలో బాంద్రా నుంచి హరిద్వార్ వెళ్లాల్సిన రైలు బుధవారం రాత్రి 10:35కు రత్లాంకు చేరుకోవాలి. […]
ఐపీఎల్ 2022 సీజన్‌లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. సెకండ్ క్వాలిఫయర్‌లో భాగంగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరనుండగా.. ఓడిపోయిన జట్టు ఇంటిదారి పట్టనుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నోపై గెలుపుతో ఆర్సీబీ జోష్ మీద ఉంది. ఇప్పటివరకు టైటిల్ గెలవని ఈ జట్టు ఆ కలను సాకారం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. డుప్లెసిస్, కోహ్లీ, పటీదార్, మ్యాక్స్‌వెల్, హసరంగ, దినేష్ కార్తీక్, […]
శ్రీకాళహస్తిలోని పిన్ కేర్ అనే ప్రైవేట్ బ్యాంక్‌లో గురువారం రాత్రి భారీ దోపిడీ జరిగింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో బ్యాంకు మేనేజర్ ఆడిటింగ్ చేస్తున్న సమయంలో కొందరు దుండగులు బ్యాంకులోకి వెళ్లి మహిళా ఉద్యోగులను బెదిరించి వాళ్లను బంధించారు. అనంతరం వాళ్ల దగ్గర లాకర్ రూమ్ తాళాలు తీసుకుని రూ.85 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి వన్‌టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. […]
టీడీపీ మహానాడు సందర్భంగా ఒంగోలులో శుక్ర, శనివారాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ వెల్లడించారు. ప్రజలందరూ ట్రాఫిక్ ఆంక్షలు పాటించి పోలీసులకు సహకరించాలని ఆమె సూచించారు. మహానాడు కార్యక్రమానికి వెళ్లే వాహనాల మార్గాలు: ★ గుంటూరు, విజయవాడ, చీరాల వైపు నుంచి మహానాడుకు వచ్చే వాహనాలు త్రోవగుంట ఫ్లై ఓవర్ ఎక్కకుండా బై లైన్/సర్వీస్ రోడ్‌లో ఎంటర్ అయ్యి కిమ్స్ అండర్ పాస్ ద్వారా విష్ణుప్రియ కళ్యాణ మండపం మీదగా […]
★ ఏపీలో నేడు, రేపు తెలుగుదేశం ‘మహానాడు’ కార్యక్రమం.. ఒంగోలు సమీపంలోని మండువారిపాలెం వద్ద మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు ★ నేడు విశాఖ, తూ.గో. జిల్లాలలో వైసీపీ మంత్రులు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర ★ కోనసీమలో వరుసగా మూడోరోజు ఇంటర్నెట్ బంద్.. బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవడంతో ప్రజల తీవ్ర ఇబ్బందులు ★ సత్యసాయి జిల్లా: నేడు హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన ★ నెల్లూరు జిల్లా: నేడు మనుబోలులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి […]
ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్కోచ్ ‘స్టార్ ఆఫ్ గవర్నెన్స్-2021’ అవార్డుకు ఎంపికైంది. జూన్ 18న ఢిల్లీలో జరిగే ఇండియన్ గవర్నెన్స్ ఫోరం వేదికగా ఈ అవార్డు ప్రదానం చేస్తారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదికి రాసిన లేఖలో స్కోచ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ దలాల్ వెల్లడించారు. Kodali Nani: చంద్రబాబు-పవన్ కలయిక.. ఏపీకి పట్టిన దరిద్రం కాగా గ్రామీణాభివృద్ధి […]
మరికొద్దిరోజుల్లోనే ఐపీఎల్ సమరం ముగియనుంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల క్రికెట్ ప్రేమికులు ఏ మాత్రం నిరాశ చెందాల్సిన అవసరం లేదు. త్వరలోనే మరో క్రికెట్ సమరం ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌కు బీసీసీఐ ఆమోదం పలికింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ లీగ్ జరగనుంది. ఈ విషయాన్ని ఏసీఏ కోశాధికారి ఎస్‌ఆర్ గోపీనాథ్‌రెడ్డి, ఏసీఏ సభ్యులు ప్రకటించారు. Hockey: ఆసియా […]
శుక్రవారం నుంచి టీడీపీ మహానాడు ప్రారంభం కానుంది. ఒంగోలు సమీపంలో జరిగే ఈ కార్యక్రమానికి టీడీపీ సర్వం సిద్ధం చేసింది. మహానాడులో పాల్గొనేందుకు పార్టీ కార్యకర్తలు భారీగా తరలివెళ్తున్నారు. అన్ని జిల్లాల నుంచి ముఖ్య నేతలు, కార్యకర్తలు ఒంగోలు బాట పట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి 10 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మహానాడులో పాల్గొనేందుకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఒంగోలు చేరుకున్నారు. మంగళగిరి నుంచి ఆయన […]