★ ఏపీలో నేడు, రేపు తెలుగుదేశం ‘మహానాడు’ కార్యక్రమం.. ఒంగోలు సమీపంలోని మండువారిపాలెం వద్ద మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు
★ నేడు విశాఖ, తూ.గో. జిల్లాలలో వైసీపీ మంత్రులు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర
★ కోనసీమలో వరుసగా మూడోరోజు ఇంటర్నెట్ బంద్.. బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవడంతో ప్రజల తీవ్ర ఇబ్బందులు
★ సత్యసాయి జిల్లా: నేడు హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన
★ నెల్లూరు జిల్లా: నేడు మనుబోలులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటన
★ ఆత్మకూరు ఉప ఎన్నికపై నెల్లూరులో నేడు అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష
★ నేడు మెదక్ జిల్లాలో మంత్రి హరీష్‌రావు పర్యటన.. ఉదయం 11 గంటలకు మెదక్‌లోని 100 పడకల మతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్న హరీష్‌రావు.. మధ్యాహ్నం 12 గంటలకు దళిత బంధు పథకం కింద మంజూరైన లబ్ధిదారులకు వాహనాలు అందజేత.. మధ్యాహ్నం 1 గంటకు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన.. మధ్యాహ్నం 1:30 గంటలకు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్‌ను ప్రారంభించనున్న మంత్రి హరీష్ రావు
★ నిర్మల్‌లో నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో దీక్ష.. మున్సిపల్ ఉద్యోగాల భర్తీలో అక్రమాలను నిరసిస్తూ కాంగ్రెస్ నేతల దీక్ష
★ ఐపీఎల్ 2022: నేడు సెకండ్ క్వాలిఫయర్‌లో తలపడనున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్.. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్