Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఓ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. పురానాపూల్ ప్రాంతంలో గంజాయి, హాష్ ఆయిల్ కొనుగోలు చేసేందుకు ఏడుగురు వ్యక్తులు వచ్చినట్లు సమాచారం అందడంతో మంగళ్‌హాట్ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో దాడులు నిర్వహించి ఎమ్మెల్సీ కుమారుడు భరత్ రాజ్ రెడ్డి, అభిషేక్, బొట్టు యూనిత్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మిగిలిన నలుగురు పరారైనట్లు వెల్లడించారు.
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
నిందితుల వద్ద నుంచి 24 గ్రాముల హాష్ ఆయిల్ సాచెట్లు, 22 గ్రాముల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్‌ను పట్టించుకోడా?
-
King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!