ఆసియా కప్ హాకీలో గురువారం ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ చెలరేగింది. 16-0 గోల్స్ తేడాతో ఇండోనేషియాను చిత్తు చిత్తుగా ఓడించింది. ఇండియా ఫస్ట్ ఆఫ్‌లో 6-0తో ముందంజలో నిలవగా.. సెకండ్ ఆఫ్‌లో భారత ఆటగాళ్ల మరింత రెచ్చిపోయారు. దీంతో మ్యాచ్ ముగిసే సమయానికి 16 గోల్స్ కొట్టారు. ఈ విజయంతో భారత్ సూపర్-4కు అర్హత సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుతం చేసిందనే చెప్పాలి. సూపర్-4 దశకు చేరుకోవడానికి భారత్ 15 గోల్స్ తేడాతో […]
పల్నాడు జిల్లాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోనసీమ ఘటన చాలా దురదృష్టకరమని.. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరు అసాంఘిక, సంఘ విద్రోహుల కారణంగా హింసాత్మక ఘటనలు జరిగాయని కొడాలి నాని ఆరోపించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌పై కొడాలి నాని ఫైర్ అయ్యారు. అమలాపురంలో పిల్లలను రెచ్చగొట్టి ఆయన పబ్బం గడుపుకుంటున్నారని విమర్శలు చేశారు. […]
ఐపీఎల్ 15వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌లో రెండు మ్యాచ్‌లు ముగిశాయి. గుజరాత్ టైటాన్స్ నేరుగా ఫైనల్‌కు చేరగా.. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడనున్నాయి. అయితే బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ వ్యూస్ పరంగా ఓ అరుదైన రికార్డు సృష్టించింది. ఈ సీజన్‌లోనే ఎక్కువ మంది హాట్‌స్టార్ ఓటీటీలో వీక్షించిన మ్యాచ్‌గా రికార్డులకెక్కింది. ఈ మ్యాచ్‌ను మొత్తం 8.7 మిలియన్ల క్రికెట్ అభిమానులు హాట్ […]
కోనసీమ జిల్లా పేరు మార్పు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కోనసీమ పేరు మార్పును నిరసిస్తూ రెండురోజుల క్రితం అమలాపురంలో పెద్ద ఎత్తున జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. చివరకు మంత్రి, ఎమ్మెల్యే నివాసాలకు కూడా ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను అరెస్ట్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా అమలాపురం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసిన 46 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. Minister Botsa: వాళ్లు అధికారంలో ఉంటే అతివృష్టి […]
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మధురానుభూతి. జీవితంలో ఒక్కసారే జరిగే అద్భుతమైన వేడుక. అందుకే కాస్త ఆలస్యమైనా మంచి ముహూర్తం చూసుకుని పెళ్లిళ్లు చేస్తుంటారు. అయితే కరోనాతో గత రెండేళ్లుగా పెళ్లిళ్లు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మంచి ముహూర్తాలు ఉండటం, కరోనా ఉధృతి తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల హడావిడి నెలకొంది. అయితే ఈ ఏడాది జూన్ నెల దాటితే ముహూర్తాలు లేవని పండితులు స్పష్టం చేస్తున్నారు. మళ్లీ డిసెంబర్ వరకు ముహూర్తాలు లేకపోవడంతో […]
కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ నిష్క్రమణ కాంగ్రెస్ పార్టీ, దాని న్యాయ బృందం (లీగల్ టీమ్)కు పెద్ద దెబ్బ. విజయవంతమైన సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ కపిల్ సిబల్ బుధవారం కాంగ్రెస్ పార్టీని వీడటం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. అనేక న్యాయ పోరాటాలలో గత ముప్పయ్ ఏళ్లుగా ఆయన పార్టీకి బలమైన గొంతుకగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం సుప్రీంకోర్టులో చురుకైన పాత్ర పోషించారు. పౌరసత్వ(సవరణ) చట్టం, గోప్యత హక్కు, మరాఠా కోటా, జహంగీర్‌పురి కూల్చివేత వంటి […]
వైసీపీ చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీపై చంద్రబాబు అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని. . ప్రజలంతా క్విట్ చంద్రబాబు, క్విట్ తెలుగు దేశం అంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ జవసత్వాలు అయిపోయాయని ఆరోపించారు. చంద్రబాబు 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో తనది అనుకున్న ఒక్క కార్యక్రమమైనా ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉంటే […]
ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు చేరింది. అయితే ఈ ఏడాది ప్లే ఆఫ్స్‌కు చేరడంలో పంజాబ్ కింగ్స్ దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్‌లలో కేవలం ఏడు విజయాలు మాత్రమే సాధించడంతో 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి పంజాబ్ కింగ్స్ నిష్క్రమించింది. కెప్టెన్లు మారినా.. ఆటగాళ్లు మారినా.. ఆ జట్టు రాత మాత్రం మారడం లేదు. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పంజాబ్ కింగ్స్ ఓపెనర్ […]
వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక న్యాయభేరీ యాత్ర గురువారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం జిల్లాకు చేరుకుంది. ఈ మేరకు విజయనగరం జిల్లాలో పైడి భీమవరం నుంచి వైసీపీ మంత్రుల సామాజిక న్యాయభేరీ యాత్ర ప్రారంభమైంది. నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి వైసీపీ నేతల బస్సు యాత్ర వలస గ్రామం చేరుకుంది. అక్కడ బహిరంగసభ అనంతరం మంత్రుల బస్సు యాత్ర విజయనగరం పట్టణంలోకి ప్రవేశించనుంది. ఈ సందర్భంగా విజయనగరంలో ప్యూమా జంక్షన్ వద్ద ఏర్పాటు చేసినభారీ బహిరంగ […]
అమలాపురం అల్లర్లపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. చిలకలూరిపేటలో ఆయన మాట్లాడుతూ.. అందమైన కోనసీమలో చిచ్చుపెట్టిన ఘనత వైసీపీదే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమను వైసీపీ మనుషులే తగులబెట్టారని ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే మంత్రి ఇంటిపై దాడి చేశారన్నారు. మంత్రి ఇంటికి అంటుకున్న మంటలను అదుపు చేసేందుకు ఫైరింజన్ కూడా రాలేదని చంద్రబాబు విమర్శలు చేశారు. వైసీపీ వాళ్ల ఇళ్లను వాళ్లే తగులపెట్టుకుని వేరే వాళ్లపై నిందలేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తప్పులు చేసి.. ఆ నేరాన్ని […]