ఒంగోలులో టీడీపీ మహానాడు భారీస్థాయిలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ మహానాడుపై మంత్రి గుమ్మనూరు జయరాం విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు వయసు అయిపోయిందని.. ఆయనకు మతి భ్రమించిందని ఎన్టీవీతో మాట్లాడుతూ ఆరోపించారు. వరుణ దేవుడి ఆశీస్సులు రాజశేఖర్ కుటుంబానికి ఉంటాయని చెప్పటానికి కురుస్తున్న వర్షాలే ప్రత్యక్ష ఉదాహరణ అని మంత్రి జయరాం అభిప్రాయపడ్డారు. వైసీపీ చేపట్టిన సామాజిక న్యాయభేరీ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలకు పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా సీఎం […]
టీడీపీ మహానాడులో వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఏపీలో ఉన్మాది పాలన కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. చేతకాని పాలన వల్ల ఏపీ పరువుపోయిందన్నారు. అటు మూడేళ్లుగా తమ నేతలను, కార్యకర్తలను ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఎంతోమంది టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తే తాను నిద్రలేని రాత్రులు గడిపానన్నారు. అనవసరంగా ఉన్మాది చేతిలో బలికావొద్దని కార్యకర్తలకు చంద్రబాబు సూచించారు. ఏపీలో పోలీసుల్లో మార్పు రావాలని… వాళ్ల లాఠీదెబ్బలకు ఇక్కడ ఎవరూ భయపడరని చంద్రబాబు హెచ్చరించారు. […]
సత్యసాయి జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన ఉద్రిక్తంగా మారింది. తన సొంత నియోజకవర్గం హిందూపురం వెళుతున్న బాలయ్యను కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. బాలకృష్ణ వెంట వెళుతున్న వాహనాలను పోలీసులు నిలిపివేశారు. దీంతో పోలీసులతో టీడీపీ నేతలు, బాలయ్య అభిమానులు వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. రెండు వారాల క్రితం హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో […]
ఏపీ మంత్రులు తలపెట్టిన సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. విశాఖ పాత గాజువాక వైఎస్ఆర్ విగ్రహం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం అమలాపురం అల్లర్లపై స్పందించారు. ఏపీలో ప్రతిపక్షాలు కావాలనే అల్లర్లు సృష్టిస్తున్నాయని స్పీకర్ తమ్మినేని ఆరోపించారు. టీడీపీ వాళ్లు చేసేది మహానాడు కాదు వల్లకాడు అని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. చచ్చిన పార్టీకి ప్రజలు దహన సంస్కారాలు […]
ఒంగోలు సమీపంలో టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. రెండు రోజుల పాటు మహానాడు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో మహానాడు కార్యక్రమానికి వచ్చే అతిథుల కోసం టీడీపీ భారీ ఫుడ్ మెనూ సిద్ధం చేసింది. మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పర్యవేక్షణలో ఆహార కమిటీ రుచికరమైన వంటకాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే వెయ్యి మంది నిష్ణాతులైన వారు మహానాడు ప్రాంగణంలో వంటకాలను సిద్ధం చేస్తున్నారు. మొత్తం 11 ఫుడ్ కోర్టులు ఏర్పాటు […]
టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను వైసీపీ ప్రభుత్వం హత్య చేసేందుకు ప్రయత్నిస్తోందని చింతమనేని ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనను హతమార్చేందుకు ఇప్పటికే రెండు సార్లు ఎన్‌కౌంటర్ చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. 2019లో ఒకసారి, 2021లో మరోసారి ఎన్ కౌంటర్ చేసేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు ఆయన వివరించారు. సకాలంలో టీడీపీ నాయకులు స్పందించకుంటే తాను ఎప్పుడో చనిపోయేవాడినని చింతమనేని ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. Three Gorges […]
వైసీపీ మంత్రులు ప్రారంభించిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రం రెండోరోజుకు చేరుకుంది. విశాఖలోని పాత గాజువాక జంక్షన్ నుంచి రెండో రోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ మేరకు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రులు బస్సు యాత్రను ప్రారంభించారు. రెండో రోజు విశాఖ, తూ.గో. జిల్లాలలో సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర జరగనుంది. లంకాలపాలెం జంక్షన్, అనకాపల్లి బైపాస్, తాళ్లపాలెం జంక్షన్, యలమంచిలి వై రోడ్డు జంక్షన్, నక్కపల్లి, తుని, అన్నవరం, జగ్గంపేట మీదుగా ఈ […]
ఒంగోలు సమీపంలోని మండువారిపాలెం వద్ద టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మూడేళ్ల తర్వాత టీడీపీ మహానాడు జరుగుతోంది. ఈ మేరకు ఉదయం 8:30 గంటలకు ప్రతినిధుల నమోదుతో మహానాడును అట్టహాసంగా ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు ఫోటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాన్ని పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. ఉదయం 10:15 గంటలకు వేదికపై మహానాడు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తొలుత టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, పార్టీ జెండా ఆవిష్కరించారు. కాగా మహానాడు […]
చైనాలోని యాంగ్జీ నదిపై నిర్మించిన త్రీగోర్జెస్ డ్యామ్ ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్. ఈ డ్యామ్ 2.33 కిలోమీటర్ల పొడవు. 181 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ మేరకు 660 కిలోమీటర్ల పొడవున రిజర్వాయర్ ఏర్పడింది. రిజర్వాయర్‌లో సముద్ర మట్టంకన్నా సుమారు 175 మీటర్ల ఎత్తున నిలిచిన నీటి బరువు ఏకంగా 39 వేల కోట్ల కిలోలు ఉంటుంది. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు చూస్తే ఈ డ్యామ్ వల్ల మానవాళికి ముప్పు […]
కూరగాయల్లో అందరూ ఎక్కువగా వినియోగించే టమోటా ధర రికార్డు స్థాయిలో పెరిగింది. నెలరోజుల క్రితం రైతు బజార్లలో టమాటా రూ.10కి దొరికితే నేడు అక్కడే రూ.55కు అమ్ముతున్నారు. వారపు సంతల్లో అయితే కిలో టమోటా రూ.100కు విక్రయిస్తున్నారు. కూరగాయలు, పండ్లు అమ్మేందుకే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్‌లో అయితే కిలో టమోటాను రూ.125 బోర్డు పెట్టి అమ్ముతున్నారు. Viral News: ముందుగా వచ్చిన రైలు.. ప్రయాణికుల డ్యాన్స్ హైదరాబాద్ నగరంలో విక్రయించే టమోటాలు ఎక్కువగా చిత్తూరు […]