నేపాల్‌లో 22 మందితో ప్రయాణిస్తున్న తారా ఎయిర్ విమానం మిస్సింగ్ విషాదం మిగిల్చింది. ఈ విమానం ఆదివారం ఉదయం 9.55 గంటలకు పోఖారాలో టేకాఫ్ తీసుకుంది. 15 నిమిషాల తర్వాత ఈ విమానం గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. దీంతో ఈ విమానం ఆచూకీ కోసం అధికారులు తీవ్ర స్థాయిలో గాలింపు చేపట్టారు. చివరకు లాంచే నది సమీపంలో ఈ విమానం కూలిపోయినట్టు అధికారులు నిర్ధారించారు. Plane Missing: నేపాల్ లో ప్లేన్ మిస్సింగ్… విమానంలో 22 […]
జూన్ 1 నుంచి జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 1న శ్రీకాకుళం జిల్లా, జూన్ 2న విజయనగరం జిల్లా, జూన్ 3న విశాఖ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో నాగబాబు పర్యటిస్తారని జనసేన పార్టీ వెల్లడించింది. ఈ పర్యటనలో మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలోని జనసేన పార్టీ ముఖ్య నాయకులకు, జిల్లా కమిటీ నాయకులకు, నియోజకవర్గ కమిటీ నాయకులకు, ఆయా విభాగాల కమిటీ నాయకులకు, […]
తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే MarQ M3 స్మార్ట్ ఫోన్‌పై ఓ లుక్కేయండి. ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్‌లో ఈ ఫోన్ తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ 6.088 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉంది. అంతేకాకుండా 5000mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. మరోవైపు ఈ స్మార్ట్ ఫోన్‌లో 2 జీబీ ర్యామ్‌తో పాటు 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మెమొరీ కార్డు సహాయంతో […]
ఆధార్ కార్డుల దుర్వినియోగాన్ని నిరోధించడం కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఓ ప్రకటన జారీ చేసింది. ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు ఇతరులతో షేర్ చేసుకునే సమయంలో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించే విధంగా మాస్క్‌డ్ జిరాక్స్ కాపీలు ఉండాలని తెలిపింది. ఈ ప్రకటన దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో విమర్శలు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆధార్ జిరాక్స్ కాపీలపై మాట మార్చింది. Smart Watches: ఈ స్మార్ట్ వాచ్ లు […]
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు పథకాలు ఏమీ ఇవ్వనని చంద్రబాబు పరోక్షంగా చెప్తున్నారని బొత్స ఆరోపించారు. సంక్షేమ పథకాల రూపంలో డీబీటీ ద్వారా చేసిన ప్రయోజనం పేద ప్రజల కోసం కాదని.. రాజకీయ ప్రయోజనాల కోసం అన్నది చంద్రబాబు ఉద్దేశమన్నారు. ఇది దుర్మార్గపు ఆలోచనగా బొత్స విమర్శలు చేశారు. ప్రపంచ బ్యాంకు జీతగాడిగా చంద్రబాబుకు పేరుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబులా క్రీములు, పౌడర్ల […]
కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ అమలాపురంలో జరిగిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు విధించిన 144 సెక్షన్‌ను మరో వారం రోజులు పొడిగించారు. అంతేకాకుండా ఇంటర్నెట్ సేవల నిలుపుదలను కూడా మరో 24 గంటల పాటు పొడిగించినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు తెలిపారు. కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ చెలరేగిన అమలాపురం అల్లర్లలో ధ్వంసమైన ఆస్తుల నష్టాన్ని నిందితుల నుండే రాబడతామని ఆయన స్పష్టం చేశారు. Konaseema Riots: […]
ఐపీఎల్ 2022 తుది దశకు చేరుకుంది. ఆదివారం రాత్రికి ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. అయితే ఐపీఎల్ విన్నర్‌కు ఇచ్చే ప్రైజ్ మనీపై సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. విజేతకు అక్షరాలా రూ.20కోట్లు అందనున్నాయి. రన్నరప్‌గా నిలిచే జట్టు రూ.13కోట్లు దక్కించుకోనుంది. అటు మూడో స్థానంలో నిలిచిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ప్రైజ్ మనీగా రూ.7కోట్లు అందనున్నాయి. మరోవైపు 4వ స్థానంలో ఉన్న లక్నో సూపర్‌జెయింట్స్ […]
టీడీపీ మహానాడు వేదికపై వైసీపీ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ చేపడుతున్న బస్సు యాత్రలో వస్తోంది మంత్రులు కాదని.. అలీబాబా 40 దొంగలు అని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. వైసీపీ మంత్రులను ప్రజలు నిలదీయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపడుతుందని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు సీఎం కాగానే కార్యకర్తలదే అధికారం అని తెలిపారు. ఇబ్బంది పెట్టిన వారిని కార్యకర్తలతోనే శిక్షలు విధించేలా న్యాయబద్దమైన, చట్టబద్దమైన అధికారాలు […]