హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అంటే అందరికీ టీడీపీ అధినేత చంద్రబాబే గుర్తొస్తారు. ముంబై లేదా బెంగళూరులో ఏర్పాటు అవుతుందనుకున్న ఐఎస్‌బీని చంద్రబాబు హైదరాబాద్ తీసుకువచ్చారు. 2001లో టీడీపీ హయాంలోనే ఐఎస్‌బీ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు కూడా ఐఎస్‌బీ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వరుసగా 17 […]
ప్రధాని మోదీ ప్రస్తుతం హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ గ్రాడ్యుయేషన్ సెర్మనీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అనంతరం గురువారం సాయంత్రం ఆయన తమిళనాడు వెళ్లనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అయితే మోదీ పర్యటనను కొంతమంది తమిళులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ‘గో బ్యాక్ మోదీ’ అంటూ వేల సంఖ్యలో ట్వీట్లు చేస్తున్నారు. దీంతో వరుసగా రెండో రోజు కూడా #GoBackModi హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. PM Modi: జీ20 దేశాల్లో […]
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సులో సీఎం జగన్‌తో పాటు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా బిజీ బిజీగా గడుపుతున్నారు. అమరరాజా బ్యాటరీస్ అధినేత హోదాలో దావోస్ సదస్సుకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ హాజరయ్యారు. ఇప్పటికే కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురితో కలిసి ఓ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న గల్లా జయదేవ్ తాజాగా మరో సదస్సులో తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో పాల్గొనడం విశేషం. ఈ మేరకు ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో […]
ఐపీఎల్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జూలు విదిల్చింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు భారీ స్కోరు చేసింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డుప్లెసిస్ డకౌట్‌గా వెనుతిరగడం, మరో ఓపెనర్ కోహ్లీ కూడా 25 పరుగులకే వెనుతిరగడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. అటు మరో స్టార్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ కూడా 9 పరుగులకే […]
మనిషి అన్న తర్వాత ఎన్నో కోరికలు ఉంటాయి. అయితే కొందరికి విచిత్రమైన కోరికలు కలుగుతాయి. జపాన్ రాజధాని టోక్యోకు చెందిన ఓ వ్యక్తికి కూడా వింత కోరిక కలిగింది. తాను నాలుగు కాళ్ల జంతువుగా మారిపోవాలన్న ఆశ పుట్టింది. దీంతో తనకు కుక్క రూపమైతే సరిగ్గా సరిపోతుందని అతడు భావించాడు. తన ఒళ్లంతా బొచ్చుతో పెద్దగా ఉండే జాతి కుక్క ‘కోలీ’గా మారిపోవాలనుకున్నాడు. దీని కోసం జెప్పెట్ అనే ప్రొఫెషనల్ ఏజెన్సీని సంప్రదించాడు. జపాన్‌లో జెప్పెట్ సంస్థ […]
టీడీపీ, జనసేనపై మంత్రి అంబటి రాంబాబు ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. అమలాపురం ఘటన దురదృష్టకరం, ఈ ఘటనను ఖండిస్తున్నాం అన్న మాట పవన్ నోటి నుంచి రాలేదని అంబటి ఆరోపించారు. ప్రభుత్వం ఉక్కుపాదంతో అల్లర్లను అణచివేయాలని పవన్ ఎందుకు డిమాండ్ చేయలేదని ప్రశ్నించారు. దాడులను ఖండించకుండా పవన్ ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోనసీమ జిల్లా మార్పు అంశంలో గతంలో పవన్ కళ్యాణ్ పార్టీ వారు ఎందుకు నిరాహార దీక్షలు చేశారో చెప్పాలని నిలదీశారు. ప్రజల నుంచి డిమాండ్ […]
మాజీ మంత్రి, దివంగత ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు బుధవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంది. ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి సంబంధించి మే 30న ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ […]
2018 ఫిబ్రవరిలో నికోలస్ క్రూజ్ అనే 19 ఏళ్ల టీనేజర్ ఫ్లోరిడాలోని స్టోన్‌మన్ డగ్లస్ హైస్కూల్‌లో కాల్పులకు పాల్పడ్డాడు. AR-15 రైఫిల్‌తో అతడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 17 మంది విద్యార్థులు చనిపోయారు. ఆ ఘటన అమెరికాతో పాటు యావత్ ప్రపంచం ఉలిక్కిపడేలా చేసింది. అభం శుభం తెలియని చిన్నారులను అకారణంగా కాల్చి చంపటం అందరి మనసులను కలచివేసింది. అగ్రరాజ్యం అమెరికాలో పెచ్చరిల్లుతోన్న గన్ కల్చర్‌కు ఇది ఒక ఉదాహరణ. సరిగ్గా ఐదేళ్ల తరువాత నాటి ఫ్లోరిడా […]
కాకినాడలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బుధవారం సాయంత్రం వైసీపీ ప్రకటించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంతబాబు జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఇప్పటికే ఈ హత్య కేసులో తన తప్పిదాన్ని అనంతబాబు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. Konaseema: కోనసీమలో మళ్లీ మొదలైన టెన్షన్.. షాపులన్నీ క్లోజ్ అనంతబాబు వాంగ్మూలం, ఇప్పటి వరకు సేకరించిన సాంకేతిక ఆధారాలను […]
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచింది. కోల్‌కతాలోని ఈడెన్ మైదానంలో చిరుజల్లులు కురుస్తుండటంతో అంపైర్లు టాస్ ప్రక్రియను వాయిదా వేశారు. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ చెత్త రికార్డు బెంగళూరు జట్టును కలవరపరుస్తోంది. 2008 నుంచి ఇప్పటి వరకు మొత్తం 14 ఐపీఎల్ సీజన్‌లు జరగ్గా.. ఆర్సీబీ ఏడు సార్లు ప్లేఆఫ్స్‌లో ఆడింది. కానీ కనీసం […]