AP DGP Rajendranath: ఈ ఏడాది ఏపీలో క్రైం రేటు తగ్గిందని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. పెండింగ్ కేసుల సంఖ్య ఈ ఏడాది చాలా తగ్గిందన్నారు. లోక్ అదాలత్‌లో 57 వేల కేసులను పరిష్కరించామని.. శిక్షలు పడే శాతం ఈ ఏడాది పెంచేందుకు పాలసీ పరంగా మార్పులు చేశామని తెలిపారు. ఈ ఏడాది కన్విక్షన్ శాతం 66.2గా ఉందని.. మహిళలపై అత్యాచారాల, హత్య కేసులో 44 మందికి శిక్ష పడిందని డీజీపీ వివరించారు. 88.5 శాతం కేసుల్లో […]
Chittoor District: చిత్తూరు జిల్లాలో నిరుద్యోగులకు వైద్య ఆరోగ్యశాఖ శుభవార్త అందించింది. ఈ మేరకు జిల్లా ఆస్పత్రిలో ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపింది. స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, పీడియాట్రీషియన్, సెక్యూరిటీ గార్డ్స్, మెడికల్ ఆఫీసర్ విభాగాలలో 53 ఖాళీలను భర్తీ చేసేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పలు పోస్టులకు కనీస అర్హత ఐదో తరగతి మాత్రమే. మిగతా పోస్టులకు సంబంధిత అంశంలో డిగ్రీ, డిప్లొమా, ఎంబీబీఎస్.. అర్హతలుగా నిర్ణయించింది. విద్యార్హతలు, […]
Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వంపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ సర్కారుపై ప్రభుత్వ ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నారని ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. పీఆర్సీ, జీతభత్యాల విషయంలో వైసీపీ ప్రభుత్వం పట్ల ఉపాధ్యాయులు కొద్దిగా అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన చెప్పారు. అయితే ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నా కూడా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని ఎమ్మెల్యే తెలిపారు. వ్యక్తిగత ధర్మం కంటే వృత్తి ధర్మం గొప్పదన్నారు. ఉపాధ్యాయుల సంఖ్య స్వల్పమని.. లక్షల […]
Lionel Messi: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఫిఫా ప్రపంచకప్ సాధించిన ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఈ మేరకు తనకు మద్దతుగా నిలిచిన ఆటగాళ్లకు అపురూప కానుకలు అందజేస్తున్నాడు. తాజాగా మెస్సీ మరోసారి భారత అభిమానుల మనసు గెలుచుకున్నాడు. తన అభిమాని, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూతురు జివా ధోనీకి బహుమతి పంపించాడు. తన జెర్సీపై ఆటోగ్రాఫ్ చేసి జివాకు పంపాడు. ఈ జెర్సీని చూసి జివా ధోని […]
YSRCP: నెల్లూరు జిల్లా వైసీపీలో వర్గపోరు ముదిరింది. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావుపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో జెడ్పీటీసీ ఊటుకూరు యామిని రాజీనామాకు సిద్ధమయ్యారు. ఇదేబాటలో మరికొంతమంది ఎంపీటీసీలు కూడా ఉన్నారు. సచివాలయ కన్వీనర్ల నియామకంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు వైఖరిపై పలువురు వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తమను సంప్రదించకుండానే పదవుల నియామకం చేపట్టారని ఆరోపిస్తున్నారు. పదవి లేకుండా అయినా ఉండగలమేమో కానీ విలువ లేని చోట ఉండలేమని జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అంటున్నారు. Read Also: […]
Andhra Pradesh: త్వరలో టీటీడీకి కొత్త పాలకమండలి నియామకం కానుంది. సంక్రాంతి తర్వాత టీటీడీలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి వైసీపీ ఉత్తరాంధ్ర పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించనున్నారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి కొనసాగుతున్నారు. 2019 జూన్ 22న తొలిసారిగా వైవీ సుబ్బారెడ్డి […]
Naga Babu: బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. ఇప్పటికే మంత్రి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి కీలక నేతలు విమర్శలు గుప్పించారు. అన్నయ్య షోకు డుమ్మా.. బాలయ్య షోకు జమ్మ.. రక్తసంబంధం కన్నా ప్యాకేజీ బంధమే గొప్పదా అంటూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు స్పందించారు. మంత్రి అంబటి రాంబాబుకు కౌంటర్ ఇచ్చారు. ‘ఏయ్.. ముందెళ్లి […]
Team India: కొత్త ఏడాది ఆరంభంలో శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు టీమిండియా సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో రెండు సిరీస్‌లకు వేర్వేరు జట్లను మంగళవారం రాత్రి సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్, డబ్ల్యూటీసీ ఫైనల్ ఉండటంతో సీనియర్లంతా టెస్టు, వన్డే ఫార్మాట్లపై ఫోకస్ పెడతారని గతంలోనే బీసీసీఐ వర్గాలు స్పష్టం […]
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి. https://www.youtube.com/watch?v=n39JAKbnKn8
Largest Number of Languages: మనుషులందరూ ఒక్కటే. కానీ వాళ్లు మాట్లాడే భాషలు వేరు. ప్రాంతానికి అనుగుణంగా ఈ భాషలను వాడుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యధిక భాషలు వాడుతున్న దేశాల జాబితాను వరల్డ్ ఇండెక్స్ సంస్థ ఎత్నోలాగ్-2022 పేరుతో విడుదల చేసింది. ఈ జాబితాలో పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూగినియా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈ దేశంలో మొత్తం 840 భాషలు వాడుకలో ఉన్నట్టు వరల్డ్ ఇండెక్స్ సంస్థ వెల్లడించింది. పపువా న్యూగినియా […]