Andhra Pradesh: త్వరలో టీటీడీకి కొత్త పాలకమండలి నియామకం కానుంది. సంక్రాంతి తర్వాత టీటీడీలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి వైసీపీ ఉత్తరాంధ్ర పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించనున్నారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి కొనసాగుతున్నారు.
2019 జూన్ 22న తొలిసారిగా వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2021 జూన్ 22న ఆయన పదవీ కాలం ముగిసింది. అయితే మరోసారి వైవీ సుబ్బారెడ్డికే బాధ్యతలను అప్పగిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. 2023లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను తీర్చిదిద్దాలని వైసీపీ సర్కారు భావిస్తోంది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీని విజయపథం వైపునకు తీసుకెళ్లేందుకు వైవీ సుబ్బారెడ్డికి పార్టీ పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించాలని జగన్ భావిస్తున్నారు.
Read Also: Raw Egg: పచ్చి గుడ్డు తింటే.. వామ్మో
అటు భూమన కరుణాకర్‌రెడ్డి గతంలోనూ టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు. 2007 నుంచి 2009 వరకు ఈ పదవిలో కొనసాగారు. ప్రస్తుతం ఆయన తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం సీఎం జగన్‌ను భూమన కలిసిన నేపథ్యంలో టీటీడీపై పట్టు ఉన్న ఆయనకు టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెడతారంటూ వైసీపీ వర్గాలు అంటున్నాయి.