ఏపీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్‌కు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రభుత్వ పనితీరు ఎలా మెరుగుపరుచుకోవాలో చర్చించామని తెలిపారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉందో సీఎం జగన్ అడిగారని.. ప్రజల్లో సంతృప్త స్థాయి ఎలా ఉందో చర్చించామని వెల్లడించారు. కోటి 40 లక్షల […]
భారత్‌లోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే వరుసలో ఏకధాటిగా 75 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణాన్ని నాలుగు రోజుల్లోనే పూర్తి చేసింది. దీంతో ఖతార్‌పేరుతో ఉన్న రికార్డును భారత్ బద్దలు కొట్టింది. ఈ మేరకు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్‌ను, రోడ్డు నిర్మాణ ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేశారు. ఇంతటి గొప్ప పనిలో రాత్రి, పగలు భాగమైన ఇంజనీర్లు, […]
టీమిండియా మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. 23 ఏళ్ల పాటు క్రికెట్‌ను ఆస్వాదించానని, ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నానని మిథాలీరాజ్ వివరించింది. దీనికి అందరి ఆశీర్వాదాలు కావాలని ఆకాంక్షించింది. అనేక మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించిన తాను భవిష్యత్తులో మహిళా క్రికెట్ వృద్ధికి తోడ్పాటును అందిస్తానని మిథాలీరాజ్ పేర్కొంది. హైదరాబాద్‌కు చెందిన మిథాలీరాజ్ ప్రపంచ మహిళా క్రికెట్‌లో వన్డేల్లో ఎక్కువ పరుగులు సాధించిన ఘనతను సొంతం […]
మహానాడు తర్వాత పార్టీ పటిష్టత, ఇంఛార్జుల పనితీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు వరుస సమీక్షలు జరుపుతున్నారు. మంగళవారం నాడు అమరావతిలోని పార్టీ కార్యాలయంలో శ్రీకాకుళం- విజయనగరం, విశాఖపట్నం-అనకాపల్లి పార్లమెంట్లపై చంద్రబాబు సమీక్షించారు. నాలుగు పార్లమెంట్ సెగ్మెంట్ల కో-ఆర్డినేటర్లు చినరాజప్ప, గణబాబు, బుద్దా వెంకన్నలతో విడివిడిగా టీడీపీ అధినేత సమీక్ష జరిపారు. రోడ్డెక్కని నేతలు, పని చేయని నాయకుల విషయంలో నివేదికలు ఇవ్వాలని వారిని చంద్రబాబు ఆదేశించారు. Minister Roja: పవన్ కళ్యాణ్ రియల్ హీరో కాదు.. రీల్ […]
ఒక్కొక్కరికి ఒక్కో వింత అలవాటు ఉంటుంది. కొందరు కొన్ని పదార్ధాలను ఇష్టంగా తింటుంటారు. చిన్నపిల్లలు బలపాలు తింటారు. పెద్దవాళ్లు జంక్ ఫుడ్ తింటారు. అయితే ఒడిశాలోని ఓ వ్యక్తి మాత్రం ఇసుక తింటున్నాడు. అతడి పేరు హరిలాల్ సక్సేనా. వయసు 68 ఏళ్లు ఉంటుంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అతడు వలసకూలీగా పనిచేస్తుంటాడు. ఉపాధి కోసం పదేళ్ల కిందట ఒడిశాకు వలస వెళ్లిపోయాడు. గంజాం జిల్లాలోని కిర్తిపూర్ గ్రామంలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ జీవిస్తున్నాడు. […]
హైదరాబాద్ నగరంలో సంచనలం రేపిన జూబ్లీహిల్స్ ఆమ్నేషియా పబ్ అత్యాచారం కేసులో లోతుగా దర్యాప్తు చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని, వీరిలో ఒక్కరే మేజర్ అని తెలిపారు. కేసులో ఐదుగురు మైనర్లు ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పేర్లు వెల్లడించడం లేదన్నారు. వారందరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశామన్నారు. అయితే ఆరో వ్యక్తి బాధితురాలిపై రేప్ చేయలేదన్నారు. రేప్ చేసిన నిందితులకు 20 ఏళ్ల […]
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘వీడొక్కడే’ సినిమా మీకు గుర్తుందా.. అందులో సూర్య స్నేహితుడు ఇతర దేశాలకు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుంటాడు. క్యాప్సూల్స్ రూపంలో ఉన్న డ్రగ్స్ మాత్రలను కడుపులో దాచుకుని విమానంలో ప్రయాణిస్తాడు. అచ్చం ఇదే తరహా ఘటన మంగళవారం నాడు ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం అధికారులు భారీ స్థాయిలో డ్రగ్స్‌ను పట్టుకున్నారు. అయితే ఇక్కడ క్రైమ్‌కు పాల్పడింది అమ్మాయి కావడం గమనార్హం. Salman Khan: చావు బెదిరింపుల వేళ […]
విశాఖ జిల్లా నర్సీపట్నంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రసాభాస జరిగింది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ప్రజలకు దగ్గరకు వెళ్లిన సమయంలో కొందరు ఆయన్ను అడ్డుకున్నారు. తమకు అమ్మ ఒడి రావడం లేదని నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయారు. మహిళలు సమస్యలు చెప్తుండగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తనను నిలదీసిన వాళ్లంతా టీడీపీ సభ్యులేనని వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై బూతుపదజాలం […]
విజయవాడలో మంగళవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను టీడీపీ నేతలు నక్కా ఆనంద్‌బాబు, పీతల సుజాత, మాణిక్యాలరావు, ఎంఎస్ రాజు కలిశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబును పదవి నుంచి బర్తరఫ్ చేయాలని గవర్నర్‌కు టీడీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ అనంతబాబు విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. అనంతబాబును పదవి నుంచి బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను కోరామన్నారు. ఏజెన్సీ ఏరియాలో అనంతబాబు […]