తిరుపతిలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 52, 53వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా 1,544 మందికి బీఎస్సీ, 328 మంది పీజీ, 91 మంది పీహెచ్‌డీ విద్యార్థులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పట్టాలను అందజేశారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖామంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు గౌరవ డాక్టరేట్‌ను గవర్నర్ ప్రకటించారు. ఎన్.వి.రెడ్డి, ఎ.కె.సింగ్, ఆలపాటి సత్యనారాయణలకు జాతీయ […]
క్యాన్సర్ మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు వదులుతున్నారు. క్యాన్సర్‌ను నయం చేసే నిఖార్సైన మందు లేకపోవడమే దీనికి కారణమన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే క్యాన్సర్ మహమ్మారికి ఇక రోజులు దగ్గరపడినట్లే అనిపిస్తోంది. చరిత్రలోనే తొలిసారిగా క్లినికల్ ట్రయల్‌లో భాగంగా ఒక గర్భాశయ క్యాన్సర్ ఔషధం చూపిన ఫలితం వైద్యులను ఆశ్చర్యపరుస్తోంది. అత్యంత ప్రమాదకరమైన పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న కొంత మంది క్యాన్సర్ పేషెంట్లకు క్లినికల్ ట్రయల్‌లో భాగంగా డోస్టార్‌లిమాబ్ అనే ఔషధాన్ని సైంటిస్టులు […]
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై పోలీసు కేసు నమోదైంది. ఇటీవల అమలాపురంలో జరిగిన అలర్లలో గాయపడిన వారిని సోము వీర్రాజు పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో జొన్నాడ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అమలాపురంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నందున తాము అభ్యంతరాలు తెలుపుతున్నామని సోము వీర్రాజుకు పోలీసులు స్పష్టం చేశారు. Devineni Uma: ఆయన్ను సీఐడీ ఎప్పుడు విచారిస్తుంది? అయితే విధి […]
సోషల్ మీడియాలో మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శలు చేశారు. ఫేక్ ట్వీట్‌పై తాను సీఐడీకి ఫిర్యాదు చేస్తే.. సోది రాంబాబు సోది మాటలు మాట్లాడుతున్నాడంటూ ఫైర్ అయ్యారు. తాను ఫాల్స్ కంప్లైంట్ చేశానంటూ ఏదేదో మాట్లాడుతున్నాడని.. ఫేక్ ట్వీట్‌ను ఆయన తనను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడం […]
సాధారణంగా జూ పార్కులకు వెళ్తే చాలా మంది అక్కడి జంతువులను చూసి మైమరిచిపోతుంటారు. కొన్ని జంతువులతో ఫోటోలు దిగాలని ఉవ్విళ్లూరుతారు. కానీ ఒక్కోసారి కొందరు జంతువుల ముందు అతిగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వ్యక్తులు జంతువులతో పరాచకాలు ఆడి ఏరికోరి కష్టాలను కొనితెచ్చుకుంటారు. ఇండోనేషియాలో కూడా ఓ యువకుడు ఇలాగే ప్రవర్తించి కష్టాల్లో పడ్డాడు. చింపాంజీతో ఆటలాడి కాసేపు గిలగిల లాడిపోయాడు. దీంతో సదరు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. Elephant Walking: వాకింగ్ కి […]
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. విద్యా శాఖలోకి మున్సిపల్ స్కూళ్ల విలీనం ప్రభుత్వ కుట్ర అని మండిపడ్డారు. ఏపీలో 2,115 పురపాలక పాఠశాలలకు చెందిన వేల కోట్ల ఆస్తుల కోసమే విలీన ప్రయత్నాలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. జగన్ తన స్వార్థం కోసం నాలుగున్నర లక్షల విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడతారా అంటూ ప్రశ్నించారు. మున్సిపల్ స్కూళ్ల విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. విలీన […]
రేపటి నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. జూన్ 9 నుంచి 19 వరకు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జూన్ 9న తొలి మ్యాచ్ జరగనుంది. అయితే సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు ఊహించని దెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టాండ్ ఇన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల ఐపీఎల్‌లో మంచి ఫామ్‌ను కనపరిచిన రాహుల్ జట్టుకు దూరం కావడం […]
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా స్పందించారు. జరభద్రం అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు. అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్‌గా మనల్ని పొగడటం ప్రారంభిస్తారని.. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడని, పరివర్తన చెందాడని మనం భావిస్తామని.. నాయకుడు మారాడని చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్ధుల లక్ష్యం నెరవేరినట్లేనని పవన్ కళ్యాణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. YSRCP: సీఎం జగన్ సీరియస్.. జీరో పెర్ఫార్మెన్స్‌తో ఏడుగురు ఎమ్మెల్యేలు అయితే […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పదో తరగతి ఫలితాలపై పవన్ కళ్యాణ్ తమను విమర్శించడం విడ్డూరంగా ఉందని పేర్ని నాని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ పదో తరగతి ఫెయిల్ అయ్యారని.. అందుకే ఆయన ఫెయిల్ అయిన విద్యార్థులంటే అభిమానం చూపిస్తున్నారని.. వాళ్లను చూస్తే ఆయనకు స్వజాతి పక్షులం అన్న ఫీలింగ్ కలుగుతుందేమో అంటూ చురకలు అంటించారు. చదువుకుంటే ఎవరైనా పాస్ అవుతారనే విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలన్నారు. పదో తరగతి […]
ఏపీలో వైసీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై బుధవారం నాడు సీఎం జగన్ వర్క్ షాప్ నిర్వహించారు. ఇప్పటిదాకా జరిగిన కార్యక్రమంలో పార్టీ నేతలకు ఎదురైన అనుభవాలు, ప్రజలు ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు, కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా నిర్వహించడం ఎలా అన్న అంశాలపై చర్చించేందుకే సీఎం జగన్ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ వర్క్ షాప్‌లో ఎమ్మెల్యేలకు సీఎం జగన్ షాకిచ్చారు. ఎమ్మెల్యేల పని తీరుపై ఆయన పవర్ పాయింట్ […]