తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘వీడొక్కడే’ సినిమా మీకు గుర్తుందా.. అందులో సూర్య స్నేహితుడు ఇతర దేశాలకు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుంటాడు. క్యాప్సూల్స్ రూపంలో ఉన్న డ్రగ్స్ మాత్రలను కడుపులో దాచుకుని విమానంలో ప్రయాణిస్తాడు. అచ్చం ఇదే తరహా ఘటన మంగళవారం నాడు ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం అధికారులు భారీ స్థాయిలో డ్రగ్స్‌ను పట్టుకున్నారు. అయితే ఇక్కడ క్రైమ్‌కు పాల్పడింది అమ్మాయి కావడం గమనార్హం.
Salman Khan: చావు బెదిరింపుల వేళ హైదరాబాద్ లో అడుగుపెట్టిన సల్లు భాయ్
ఆఫ్రికా మలావి దేశం నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి వద్ద రూ 9.11 కోట్ల విలువ చేసే 607 గ్రాముల కొకైన్‌ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఇథియోపియా అడిస్ అబాబా నుంచి ఢిల్లీ వచ్చిన లేడీ కిలాడీ కడుపులో 51 డ్రగ్స్ క్యాప్సూల్స్‌ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. మహిళ తన కడుపులో దాచిపెట్టుకున్న డ్రగ్స్ గుట్టును అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి అధికారులు రట్టు చేశారు. పట్టుబడ్డ లేడీ కిలాడీని ఆసుపత్రికి తరలించారు. శస్త్రచికిత్స అనంతరం కడుపులో దాచిన కొకైన్ క్యాప్సూల్స్‌ను వైద్యులు బయటకు తీశారు. అనంతరం నిందితురాలిపై NDPD యాక్ట్ కింద కేసు నమోదు చేసి కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.