విశాఖ జిల్లా నర్సీపట్నంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రసాభాస జరిగింది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ప్రజలకు దగ్గరకు వెళ్లిన సమయంలో కొందరు ఆయన్ను అడ్డుకున్నారు. తమకు అమ్మ ఒడి రావడం లేదని నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయారు. మహిళలు సమస్యలు చెప్తుండగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తనను నిలదీసిన వాళ్లంతా టీడీపీ సభ్యులేనని వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై బూతుపదజాలం ఉపయోగించారు.
అయ్యన్నపాత్రుడిని రమ్మనండి.. చూసుకుందాం అంటూ మైక్‌లోనే వైసీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ సవాల్ విసిరారు. తాను తలుచుకుంటే అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లలేడని.. అవసరమైతే ఆయన్ను గుడ్డలూడదీసి కొడతామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చెత్త నా కొడకా అంటూ మండిపడ్డారు. అయ్యన్నపాత్రుడు రౌడీ నా కొడుకు అంటూ మండిపడ్డారు. కాగా వైసీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ చేసిన వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీడీపీ స్పందించింది. అమ్మ ఒడి రాలేదు అని ప్రజల్లో కొంతమంది అడగడమే తప్పా అని టీడీపీ ప్రశ్నించింది.
గడప గడపకు వైసీపీ రౌడీయిజం చూసారా? నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ బూతులు విన్నారా? అమ్మ ఒడి రాలేదు అని ప్రజల్లో కొంతమంది అడగడమే ఈయన కోపానికి కారణం. మీరు తెలుగుదేశం కార్యకర్తలు… అయ్యన్నపాత్రుడి మనుషులు అంటూ తిట్లు అందుకున్నాడు. pic.twitter.com/GVGWCSECLp
— Telugu Desam Party (@JaiTDP) June 7, 2022