ఈనెల 9 నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఒడిశా కటక్‌లోని బారాబతి స్టేడియంలో జూన్ 12న రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఈ మ్యాచ్‌కు హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయన తొలి టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. ఒడిశా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పంకజ్ లోచన్ మొహంతి, కార్యదర్శి సంజయ్ బెహెరా సీఎం నవీన్ పట్నాయక్‌కు తొలి టికెట్ అందజేశారు. […]
దేశంలో మొబైల్ వాడేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో తమకు నచ్చిన, అందుబాటులో ఉండే నెట్‌వర్క్‌ను మొబైల్ యూజర్లు ఎంచుకుంటున్నారు. ఈ తరుణంలో ఇప్పటికే మార్కెట్‌లో బాగా పోటీపడుతున్న జియో, ఎయిర్‌టెల్‌కు తోడుగా ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా పలు ఆఫర్లను అందుబాటులోకి తెస్తోంది. అందులో భాగంగా కేవలం రూ.100 కన్నా తక్కువగా ఉండే మూడు ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. రూ.87 ప్లాన్: బీఎస్ఎన్ఎల్ తెచ్చిన రూ.100లోపు ప్లాన్‌లలో ఇది తక్కువ. ఎంతోమంది యూజర్లకు ఈ […]
ఏపీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బాలాజీ జిల్లాలో మంత్రి రోజా పర్యటిస్తున్నారు. వడమాలపేట మండలం ఎస్వీపురం గ్రామంలో మంగళవారం నాడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను మంత్రి రోజా వివరించారు. Varla Ramaiah: సజ్జల చేతుల్లో సీఐడీ పావుగా మారింది ఓ ఇంటి దగ్గర మంత్రి రోజా ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓ అమ్మాయిని […]
ఏపీ సీఐడీ దారి తప్పిందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ సీఐడీ ఏ దిక్కు వెళ్లాలో తెలియని పరిస్థితిలో ఉందని.. ప్రతిపక్ష పార్టీల మీద కక్ష తీర్చుకునే విషయంలో అధికార పార్టీకి సీఐడీ పావుగా ఉపయోగపడుతోందని వర్ల రామయ్య ఆరోపించారు. సజ్జల చేతుల్లో సీఐడీ పావుగా మారిందన్నారు. సీఐడీ చీఫ్ సునీల్ కుమారుడిని సీఎం జగన్, సజ్జల బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వర్ల రామయ్య విమర్శలు చేశారు. సునీల్ […]
ప్రభుత్వ వైద్యులకు తెలంగాణ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. సాధారణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యుల్లో ఎక్కువ మంది ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తుంటారు. అయితే ఇకపై ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయరాదంటూ మంగళవారం నాడు హెల్త్ సెక్రటరీ రిజ్వీ జీవో విడుదల విడుదల చేశారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వైద్యులు ప్రాక్టీస్ చేసుకోవచ్చని.. వారిపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని క్లారిటీ […]
కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. గత వారం దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకాలోని ఉప్పినగండి ప్రభుత్వ కాలేజీ తరగతి గదిలో హిజాబ్ ధరించేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ 23 మంది విద్యార్థినులు నిరసన తెలిపారు. దీంతో కాలేజీ యాజమాన్యం వారందరినీ వారంపాటు సస్పెండ్ చేసింది. విద్యార్థినులు వారం పాటు కాలేజీకి రాకుండా నిషేధం విధించింది. Corona Updates : కర్ణాటకలో మళ్లీ కరోనా కలవరం.. అయితే ఈ ఏడాది మార్చిలో హిజాబ్‌పై కర్ణాటక […]
దేశీయ క్రీడలకు నెమ్మదిగా ప్రాధాన్యం పెరుగుతోంది. ఇప్పటికే ఐపీఎల్, ప్రొ.కబడ్డీ లీగ్ వంటి టోర్నీలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఖోఖో క్రీడకు సంబంధించి ఓ మెగా లీగ్ రాబోతోంది. ఈ ఏడాది ప్రారంభం కానున్న అల్టిమేట్ ఖోఖో లీగ్(యూకేకే)లో తెలంగాణకు చెందిన టీమ్‌ను జీఎంఆర్ కొనుగోలు చేసింది. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (కేకేఎఫ్‌ఐ) సహకారంతో ఖోఖో లీగ్‌ను డాబర్ గ్రూప్ ఛైర్మన్ అమితక బర్మన్ ఏర్పాటు చేయగా పలు రాష్ట్రాల నుంచి ఫ్రాంచైజీలు […]
ప్రముఖ సంస్థ గూగుల్‌కు ఓ కోర్టు భారీ షాకిచ్చింది. ఆస్ట్రేలియాలో ఓ రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానెల్‌లో వైరల్ అయిన వీడియో కారణంగా ఆయన రాజకీయాలను వీడాల్సి వచ్చిందని, దీంతో ఆ నేతకు రూ.4 కోట్ల జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. న్యూ పౌత్ వేల్స్ డిప్యూటీ ప్రీమియర్‌గా ఉన్న జాన్ బరిలారోను విమర్శిస్తూ జోర్డాన్ శాంక్స్ అనే రాజకీయ విశ్లేషకుడు 2020లో కొన్ని వీడియోలు తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. అయితే […]
టీమిండియా మాజీ పేసర్, గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు చాహల్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీనియర్ కమ్ కోచ్ అయిన నెహ్రా చాహల్‌తో క్లోజ్‌గా ఉంటాడు. అయితే ఐపీఎల్ ఫైనల్ ముగిసిన అనంతరం ఓ పార్టీలో మద్యం సేవించగా.. అనంతరం రోడ్డు మీద ఈ ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. పార్టీ అయిపోయిన తర్వాత చాహల్‌ను నెహ్రా ‘అరే బస్‌లో వెళ్దాం రా’ అంటే […]
పవన్ కళ్యాణ్ ఇచ్చిన మూడు ఆప్షన్‌లపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. రాజకీయాల్లో సీరియస్‌గా ఉన్నవాళ్లు ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తారని.. కానీ విశ్లేషకుడిగా పవన్ కళ్యాణ్ ఆప్షన్లు మాత్రమే చెప్పారని సజ్జల ఆరోపించారు. జనసేన తన పార్టీ అని పవన్ కళ్యాణ్ మర్చిపోయినట్లు ఉన్నారని సజ్జల చురకలు అంటించారు. బీజేపీ వస్తుందో లేదో కానీ టీడీపీతో వెళ్ళటం ఖాయమని పవన్ కళ్యాణ్ మాటలను బట్టి అర్థం అవుతోందన్నారు. చంద్రబాబు గేమ్ […]