ఏపీలో త్వరలో మరో క్రికెట్ సమరం ప్రారంభం కానుంది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టీ-20 టోర్నీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోగో, టీజర్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. సీఎం నివాసంలో సీఎం జగన్‌ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. జూలై 6 నుంచి జూలై 17 వరకు విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టోర్నమెంట్ జరగనుంది. […]
ఏపీకి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఏపీ బీజేపీ కోర్ కమిటీ నేతలు సమావేశమై కీలకంగా చర్చించారు. ఈ సమావేశానికి పార్టీ ఏపీ చీఫ్ సోము వీర్రాజుతో పాటుగా పార్టీ ఎంపీలు టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, సీఎం రమేష్, కీలక నేతలు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, జీవీఎల్ నరసింహారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా వైసీపీ విషయంలో భవిష్యత్ కార్యాచరణపైనా చర్చ జరిగిందని […]
ఏపీలో అధికార పార్టీ వైసీపీ నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. ఇప్పటిదాకా సాగిన ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక జగన్ చెంతకు చేరింది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఈ కార్యక్రమం జరుగుతున్న తీరుపై వైసీపీ నేతలతో సీఎం జగన్ కీలక భేటీ నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, […]
ఏపీలో పదో తరగతి ఫలితాలలో కుట్ర జరిగిందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. టెన్త్‌లో ఎక్కువ మంది పాసైతే అమ్మ ఒడితో పాటు ఇంటర్, పాలిటెక్నిక్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాల్సి వస్తుందనే కుట్రతోనే ఎక్కువ మందిని ఫెయిల్ చేశారని మండిపడ్డారు. అయితే ఇది టెన్త్ స్టూడెంట్స్ ఫెయిల్ కాదని.. సర్కారు ఫెయిల్యూర్ అంటూ లోకేష్ విమర్శించారు. జగన్ ప్రభుత్వం తొలిసారి నిర్వహించిన టెన్త్ పరీక్షల్లో పేపర్ లీక్, మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీసుల […]
కోనసీమ జిల్లా వాసులకు 15 రోజులుగా ఇంటర్నెట్ సేవలు అందకపోవడంతో తెగ ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కోనసీమ వాసులకు గుడ్ న్యూస్ అందింది. రేపటి నుంచి కోనసీమ జిల్లావ్యాప్తంగా పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పోలీసులు వెల్లడించారు. గత నెల 24 నుంచి 16 మండలాలలో ఇంటర్నెట్ సేవలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే నాలుగు రోజులుగా విడతల వారీగా ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తున్నారు. జిల్లాలో 15 మండలాలు ఉండగా.. ప్రస్తుతం అమలాపురం, అల్లవరం […]
మతపరమైన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో నవీన్ జిందాల్, నుపుర్ శర్మలపై బీజేపీ అగ్రనాయకత్వం కఠిన చర్యలు తీసుకుందని ఆ పార్టీ నేత విజయశాంతి గుర్తుచేశారు. దేశంలో మత సామరస్యం దెబ్బతినకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తగిన నియంత్రణలు చేపట్టిందని తెలిపారు. అయినప్పటికీ టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ బీజేపీపై విమర్శలు గుప్పించడం సరికాదని విజయశాంతి అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ భాగస్వామి పార్టీ, కవల మతతత్వ పార్టీ అయిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా బీజేపీ నుంచి సస్పెండ్ అయిన […]
34 ఏళ్ల నాటి రోడ్డు రేస్ కేసులో పాటియాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న పంజాబ్ కాంగ్రెస్ నేత నవ్యజోత్ సింగ్ సిద్దూ ఆస్పత్రి పాలయ్యారు. ఈ మేరకు ఆయన చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌లో చేరారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో సిద్ధూను పాటియాలా జైలు నుంచి భారీ భద్రతతో పీజీఐఎంఈఆర్‌కి పోలీసులు తరలించారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హెపటాలజీ విభాగంలో సిద్దూ వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. Destination […]
ఏపీలో మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమాల మధ్య వార్ కొనసాగుతోంది. పొత్తులపై పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ తాను ట్వీట్ చేసి డిలీట్ చేశానన్న మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై దేవినేని ఉమ కౌంటర్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వమే స్వయంగా ఫేక్ ట్వీట్లను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. సీఎం జగన్‌కు తెలిసే సజ్జల డైరెక్షన్‌లో ఫేక్ ప్రచారం జరుగుతోందని దేవినేని ఉమ ఆరోపించారు. కులాల మధ్య, పార్టీల మధ్య వైషమ్యాలు పెంచేందుకు ప్రభుత్వమే ఫేక్ ప్రచారానికి […]
తమ స్థలంలో లంకె బిందెలు ఉన్నాయని.. పురావస్తుశాఖ ద్వారా తవ్వించాలంటూ ఓ మహిళ సాక్షాత్తు గ్రీవెన్స్ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్‌ను కోరిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళ్తే.. పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన దిల్షాద్ బేగం అనే ముస్లిం మహిళ తన పూర్వీకుల స్థలం కారంపూడిలోని కన్యకాపరమేశ్వరి ఆలయం పక్కన గల బజారులో ఉందని.. సదరు స్థలంలో లంకెబిందెలు ఉన్నట్లు తనకు తెలిసిందని స్వయంగా పల్నాడు జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. […]
ఏపీలో కొన్నిరోజుల్లో మరోసారి ఎన్నికల సమరం జరగనుంది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఆత్మకూరు ఉప ఎన్నిక నిర్వహించడం అనివార్యమైంది. నేటితో ఆత్మకూరు ఉప ఎన్నిక నామినేషన్‌ల పర్వం కూడా ముగిసింది. చివరి రోజైన సోమవారం నాడు 13 నామినేషన్‌లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 28 నామినేషన్లు దాఖలైనట్లు స్పష్టం చేశారు. మంగళవారం నాడు నామినేషన్‌ల పరిశీలన జరుగుతుందని తెలిపారు. ఆత్మకూరు ఉప ఎన్నికకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ దూరంగా ఉండటంతో ప్రధానంగా […]