Mithali Raj: అంతర్జాతీయ క్రికెట్‌కు మిథాలీరాజ్ గుడ్‌బై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. 23 ఏళ్ల పాటు క్రికెట్‌ను ఆస్వాదించానని, ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నానని మిథాలీరాజ్ వివరించింది. దీనికి అందరి ఆశీర్వాదాలు కావాలని ఆకాంక్షించింది. అనేక మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించిన తాను భవిష్యత్తులో మహిళా క్రికెట్ వృద్ధికి తోడ్పాటును అందిస్తానని మిథాలీరాజ్ పేర్కొంది. హైదరాబాద్‌కు చెందిన మిథాలీరాజ్ ప్రపంచ మహిళా క్రికెట్‌లో వన్డేల్లో ఎక్కువ పరుగులు సాధించిన ఘనతను సొంతం చేసుకుంది.
Virat Kohli: అక్కడ డబుల్ సెంచరీ.. ఆ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్
Also Read
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి మన దేశ గెలుపుకోసం తన వంతు కృషి చేశానని మిథాలీరాజ్ తెలిపింది. తనకు ఎంతో సహకరించిన బీసీసీఐకి ధన్యవాదాలు చెప్తున్నట్లు పేర్కొంది. కాగా 1999లో 16 ఏళ్ల వయసులో మిథాలీ రాజ్ ఇండియాకు క్రికెట్ ఆడటం మొదలు పెట్టింది. తొలి మ్యాచ్‌లో మిథాలీరాజ్ (114 నాటౌట్) సెంచరీతో సంచలనం సృష్టించింది. 2017 ప్రపంచ కప్‌లో కెప్టెన్‌గా భారత జట్టును ఫైనల్స్‌కు తీసుకెళ్లింది. వన్డేల్లో వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు చేసి వరల్డ్ రికార్డు నెలకొల్పింది. సచిన్ తర్వాత 23 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్‌ను పూర్తి చేసుకున్న రెండో క్రికెటర్‌గా మిథాలీరాజ్ చరిత్ర సృష్టించింది. అర్జున, పద్మశ్రీ, ఖేల్ రత్న వంటి అవార్డులను కూడా మిథాలీరాజ్ అందుకుంది. మిథాలీరాజ్ తన అంతర్జాతీయ క్రికెట్‌లో 232 వన్డేలు ఆడి 50.7సగటుతో 7,805 పరుగులు, 89 టీ20లు ఆడి 37.5 సగటుతో 2,364 పరుగులు, 12 టెస్టులు ఆడి 43.7 సగటుతో 699 పరుగులు చేసింది. మహిళల వన్డేల్లో 7వేల పరుగుల మార్కు అధిగమించిన ఏకైక మహిళా క్రికెటర్‌గా మిథాలీరాజ్ రికార్డు సృష్టించింది.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!