Ramesh Nalam
Author- NTV Telugu-
Stock Market: నాలుగు రోజుల నష్టాలకు తెర.. భారీ లాభాలతో క్లోజ్
నాలుగురోజుల వరుస నష్టాలకు ఈరోజు తెరపడింది. భారత స్టాక్‌మార్కెట్లు గురువారం నాడు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 427 పాయింట్ల లాభంతో 55,320 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 121 పాయింట్ల లాభంతో 16,478 వద్ద ముగిసింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ విధానం ప్రభావం ఎక్కువేమీ స్టాక్ మార్కెట్లపై పడలేదు. మధ్యాహ్నం వరకు రేంజ్ బౌండ్‌లో కదలాడిన సూచీలు సాయంత్రానికి సర్రున పైకి ఎగిశాయి. దీంతో లాభాలను చవిచూశాయి. ఉదయం 10 గంటల సమయంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ […] -
Vijaya Sai Reddy: అచ్చెన్న.. ఆల్రెడీ టీడీపీ ఆఫీసులకు తాళాలు పడ్డాయి
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు వస్తే టీడీపీ కార్యాలయానికి తాళం వేస్తామని సవాల్ చేసిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చె్న్నాయుడికి వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘పార్టీ లేదు బొక్కా లేదన్న మీ మాటల దెబ్బకు ఆల్రెడీ టీడీపీ ఆఫీసుకి తాళాలు పడ్డాయి అచ్చన్న.. తోలు మందం వల్ల మీకు తెలియడం లేదు.. రెఫరెండం కోరాలనుకుంటే టీడీపీ ఎమ్మెల్యేలందరితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లొచ్చుగా’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. పార్టీ […] -
Purandeswari: రూ.100 నాణేంపై ఎన్టీఆర్ బొమ్మ.. ఆర్‌బీఐ గ్రీన్‌సిగ్నల్
దివంగత నేత నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. ఎన్టీఆర్ బొమ్మను రూ.100 నాణెంపై ముద్రించేందుకు ఆర్‌బీఐ గవర్నర్ సుముఖత వ్యక్తం చేసినట్లు బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి వెల్లడించారు. తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మ ఉన్న రూ.100 నాణెం వాడుకలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. Andhra Pradesh: వాట్సాప్‌తో చేతులు కలిపిన ఏపీ డిజిటల్ […] -
Andhra Pradesh: వాట్సాప్‌తో చేతులు కలిపిన ఏపీ డిజిటల్ కార్పొరేషన్
ఏపీ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కీలకపాత్ర పోషిస్తున్న ఏపీ డిజిటల్ కార్పొరేషన్ (ఏపీడీసీ) ఇప్పుడు వాట్సాప్ సేవలను కూడా ప్రారంభించింది. ఇందుకోసం ఏపీడీసీ వాట్సాప్‌తో ఒప్పందం చేసుకుంది. ఏపీలో ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వేదిక అవసరాన్ని, ప్రాముఖ్యతను గుర్తించి వాట్సాప్ ఇండియా ఏపీడీసీ వాట్సాప్ వేదికకు పూర్తి సాంకేతిక మద్దతు అందిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, నిర్ణయాలకు సంబంధించిన […] -
CM Jagan: మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలివ్వాలి.. బ్యాంకర్లకు సూచన
అమరావతిలో 219వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం జరిగింది. సీఎం జగన్ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2022–23 వార్షిక రుణ ప్రణాళికను ఎస్ఎల్‌బీసీ వెల్లడించింది. ఇందులో 51.56 శాతం వ్యవసాయ రంగానికి రూ.1,64,740 కోట్లు కేటాయించినట్లు ఎస్‌ఎల్‌బీసీ తెలిపింది. కాగా 2021-22లో నిర్దేశించుకున్న మొత్తంలో కౌలు రైతులకు కేవలం 42.53 శాతమే రుణాలు అందాయని ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో సీఎం జగన్ […] -
BCCI: వడగాలుల దెబ్బ.. టీ20 మ్యాచ్ నిబంధనల్లో మార్పులు
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈరోజు నుంచి ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అయితే తొలి టీ20 జరిగే ఢిల్లీలో రాత్రిపూట కూడా వడగాలులు వీస్తున్నాయి. ఉదయం వేళల్లోనే ఢిల్లీలో ఉష్ణోగ్రత 36 నుంచి 38 డిగ్రీల వరకు ఉంటోంది. మధ్యాహ్నం మరింత తీవ్రరూపం దాల్చుతోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్య గరిష్ఠంగా 43 నుంచి 44 డిగ్రీలను టచ్ చేస్తోంది. […] -
Bank Holidays: ఖాతాదారులకు అలర్ట్.. మూడురోజులు వరుసగా బ్యాంకులు బంద్
ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మెకు దిగనున్నారు. వారానికి ఐదురోజులే పనిదినాలు ఉండాలని, తమకు పెన్షన్ ఇవ్వాలన్న డిమాండ్లను పరిష్కరించాలంటూ ఈనెల 27న సమ్మె చేయనున్నట్లు 9 బ్యాంకుల యూనియన్‌ల సంస్థ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటన చేసింది. నేషనల్ పెన్షన్ స్కీమ్‌ను ఎత్తివేసి పాత పెన్షన్ స్కీమ్‌ను మళ్లీ ప్రవేశపెట్టాలని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం డిమాండ్ చేశారు. పెన్షనర్లందరి పెన్షన్ల అప్‌డేషన్, రివిజన్ తమ […] -
Atchannaidu: వైసీపీకి సవాల్.. 175 స్థానాల్లో గెలిస్తే టీడీపీ ఆఫీస్‌కు తాళం
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు వస్తే టీడీపీ కార్యాలయానికి తాళం వేస్తామని అచ్చెన్నాయుడు సంచలన ప్రకటన చేశారు. 175 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని జగన్‌కు అంత నమ్మకమేంటని ప్రశ్నించారు. నిజంగా అంత నమ్మకం ఉంటే జగన్ ఇప్పుడే ఎన్నికలకు వెళ్లాలని అచ్చెన్నాయుడు సవాల్ చేశారు. తక్షణమే గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు జగన్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అసలు […] -
Viral News: డోంట్ మిస్.. ఈనెల 24న ఆకాశంలో అద్భుతం
ఖగోళ ప్రియులకు ఈనెల 24న ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. నవగ్రహాలలోని ఐదు గ్రహాలు ఒకే వరుసలో కన్పించనున్నాయి. ఆయా గ్రహాలు వాటి కక్ష్యల్లోనే తిరుగుతున్నప్పటికీ ఒకే వరుసలో ఉన్నట్లు కన్పించడమే ఈ అద్భుతం అని ఖగోళ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఈ మేరకు బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురు, శని గ్రహాలు ఒకే వరుసలో ఉన్నట్లు కనిపించనున్నాయి. సాధారణంగా మూడు గ్రహాలు ఒకే వరుసలో వస్తూంటాయి. అలా జరగడాన్ని గ్రహాల సంయోగంగా పిలుస్తారు. Dostarlimab: గుడ్‌న్యూస్.. […] -
Chandra Babu: మరోసారి చంద్రబాబు జిల్లాల టూర్.. ఏడాది పాటు పర్యటనలు
టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఏపీలో జిల్లాల పర్యటనలకు రెడీ అవుతున్నారు. 26 జిల్లాలలో ఏడాది పాటు విస్తృత పర్యటనలు చేయాలని ఆయన నిర్ణయించారు. ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాల్లో భాగంగా ప్రతి జిల్లాలోనూ చంద్రబాబు పర్యటించనున్నారు. జిల్లా పర్యటనల్లో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. చంద్రబాబు ఒక్కో టూర్ మూడు రోజుల చొప్పున నెలకు రెండు జిల్లా టూర్లు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల మూడో వారం నుంచే […]
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్‌ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!