Guntur District: హిందూ శాస్త్ర ప్రకారం కొన్ని ఆలయాలకు కొన్ని మహిమలు ఉంటాయి. అలాంటి ఆలయాలను సందర్శిస్తే అనుకున్న కోరికలు నెరవేరతాయి. గుంటూరు జిల్లా చేబ్రోలులో ఉన్న భీమేశ్వరస్వామి ఆలయం చోళుల కాలం నాటిది. ఈ ఆలయం రెండు ప్రాకారాలుగా ఉంది. రెండో ప్రాకారంలో స్వామి కొలువై ఉంటారు. ఈ ఆలయం ద్రాక్షారామం భీమేశ్వరాలయం, సామర్లకోట కుమార భీమేశ్వరస్వామి ఆలయాలను పోలి ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే అవివాహితులకు త్వరగా పెళ్లి అవుతుందని నమ్మకం ఉంది. అంతేకాకుండా సంతానార్ధులకు పిల్లలు కలుగుతారని భక్తులు విశ్వసిస్తున్నారు.
Read Also: Bandi Sanjay: మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా.. దేశ ప్రయోజనాల కోసమే
కాగా గుంటూరు జిల్లా చేబ్రోలు ఆధ్యాత్మిక కేంద్రానికి నిలయం. అక్కడ అద్భుత విశేష పురాతన ఆలయాలు ఉన్నాయి. ఆ ఊరంతా ఎటు వెళ్లినా ఆలయాలు, మండపాలు, శిధిల పురాతన నిర్మాణాలే మనకు కనపడతాయి. పూర్వం ఇక్కడ 101 దేవాలయాలు, 101 బావులు వుండేవని ప్రసిధ్ధి. కాలక్రమంలో అవన్నీ అంతరించి పోయినా ఇప్పటికీ కొన్ని ఆలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. మరికొన్ని ఆలయాల్లో నిత్యం దూపదీపారాధన జరుగుతోంది. అలాంటి ఆలయాల్లో భీమేశ్వరస్వామి ఆలయం ఒకటి. చేబ్రోలులోని భీమేశ్వరస్వామి ఆలయాన్ని క్రీ శ.892లో చాళుక్య భీమరాజు కట్టించారు. ఒకప్పుడు ఇక్కడ బౌద్ధ చైత్యం ఉండేది. దాన్నే భీమరాజు భీమేశ్వరాలయంగా మార్చాడని చరిత్రకారులు భావించారు. విశాలమైన ఆవరణ, దాని లోపల ప్రాకారం, మధ్యలో భీమేశ్వరాలయం ఉంటాయి.