Budda Venkanna: మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నానికి టిక్కెట్ ఇచ్చి చంద్రబాబు చారిత్రాత్మకమైన తప్పు చేశారని.. చంద్రబాబు యాత్రను తప్పు పట్టే స్ధాయి కొడాలి నానిది కాదన్నారు. రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చంద్రబాబు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. రాష్ట్రానికి శని ఎవరో డిబేట్‌కు తాను రెడీ అని.. కొడాలి నాని వస్తే ప్రజల్లో తేల్చుకుంటామన్నారు. గుడివాడలో ఓడిపోతామనే కొడాలి నాని ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నాడని బుద్దా వెంకన్న ఆరోపించారు. కొడాలి నాని ఒక పిచ్చి కుక్క అని.. చంద్రబాబుకు గుంటూరులో జరిగిన ఘటనకు అసలు సంబంధం ఉందా అని ప్రశ్నించారు.
Read Also: Mass Maharaj: ఒకే రోజు మొదలైన రవితేజ రెండు సినిమాల డబ్బింగ్!
చంద్రబాబు భార్య గురించి కొడాలి నాని మాట్లాడుతున్నాడని.. అతడి భార్య గురించి తాము ఎప్పుడైనా మాట్లాడామ అని బుద్దా వెంకన్న సూటిగా ప్రశ్నించారు. పేద ప్రజల బియ్యాన్ని పంది కొక్కులా కొడాలి నాని తిన్నాడని.. కొడాలి నాని ఖబడ్దార్.. అతడు గుడివాడలో ఓడిపోవడం ఖాయమన్నారు. చంద్రబాబు పర్యటనలో పలువురు చనిపోవడంతో చంద్రబాబుతో పాటు అంతా కుమిలిపోయామని.. జోగి రమేష్ ఒక చెంచా అని.. కేంద్ర ప్రభుత్వం కలగజేసుకుని ముందుగా జగన్‌ను అరెస్టు చేయాలన్నారు.చంద్రబాబు సభలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు.
చంద్రబాబు సభలకు భద్రత ఇవ్వకపోగా పోలీస్ శాఖ వైసీపీ ఆఫీస్ కనుసన్నల్లో నడుస్తున్నట్లు అనిపిస్తుందన్నారు. జగన్ను సీఎంగా బర్తరఫ్ చేసి విచారిస్తే చావుల వెనకాల విషయాలు బయటకొస్తాయన్నారు. మంత్రులు చెంచాగాళ్లు అని.. చంద్రబాబుపై మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. గుంటూరులో ఎవరో ప్రోగ్రామ్ పెడితే చంద్రబాబు వెళ్లారన్నారు. 2019లో జగన్ సీఎం అయ్యాకే ఏపీకి శని పట్టిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. జగన్ సహా తాజా, మాజీ మంత్రులే లబ్ధిపొందారని ఆరోపించారు. చంద్రబాబు సభల్లో వైసీపీ నేతలే ఏదో చేయిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని.. గోదావరిలో బోటు మునిగితే బయటకు తీయడానికి 38 గంటల సమయం తీసుకున్నారని.. ఆ బోటు ప్రమాదంలో నాలుగు మృతదేహాలు ఇప్పటికీ వెలికి తీయలేదని బుద్ధా వెంకన్న చురకలు అంటించారు.