ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రకారం రాజధాని అమరావతిలో సీఆర్‌డీఏ అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. కానీ అభివృద్ధి పనులు చేపట్టాలంటే నిధులు అవసరం. కానీ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో రాజధాని అభివృద్ధికి నిధుల కోసం సీఆర్‌డీఏ మరింత కసరత్తు చేస్తోంది. రాజధాని పరిధిలో పూర్తయిన భవనాలను లీజుకివ్వాలని సీఆర్‌డీఏ ప్రతిపాదనలు చేసింది. రాజధానిలో గ్రూప్-డి ఉద్యోగులకు నిర్మించిన భవనాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్‌డీఏ ప్రతిపాదనలకు […]
దేశవాళీ క్రికెట్‌లో మధ్యప్రదేశ్ తన సత్తా చాటుకుంది. ఈ ఏడాది జరిగిన రంజీ ట్రోఫీని మధ్యప్రదేశ్ జట్టు సొంతం చేసుకుంది. 2021-22 సీజన్ రంజీ ట్రోఫీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ జట్టు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ముంబై జట్టుపై ఆరు వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్ గెలిచి చరిత్రలో తొలిసారిగా రంజీ ట్రోఫీని దక్కించుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో ముంబై జట్టు 269 పరుగులు చేయగా మధ్యప్రదేశ్ ముందు 108 పరుగుల స్వల్ప […]
చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ ప్లీనరీ సమావేశం జరిగింది. ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు భరత్, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, వేంకటేష్ గౌడ, జెడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. కరోనా వల్ల గత రెండేళ్లు వైసీపీ ప్లీనరీ జరుపుకోలేకపోయామని..జూలై […]
ఆత్మకూరు ఉపఎన్నికలో వైసీపీకి భారీ మెజారిటీ రావడంపై మంత్రి అంబటి రాంబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరులో టీడీపీ పోటీలో లేకున్నా కుట్రలు చేసిందని ఆరోపించారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారని.. బద్వేలులో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ నేతలే బీజేపీ ఏజెంట్లుగా ఉన్నారని అంబటి రాంబాబు విమర్శలు చేశారు. గత మూడేళ్లలో జరిగిన ఉప ఎన్నికల […]
మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘనవిజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి భరత్‌పై వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి 83వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరు విజయంపై సీఎం జగన్ స్పందించారు. ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్‌కు నివాళిగా ఆత్మకూరులో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని సోషల్ మీడియాలో జగన్ ట్వీట్ చేశారు. విక్రమ్‌ను దీవించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి […]
ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టులో కరోనా కలకలం రేగింది. కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డాడు. శనివారం నిర్వహించిన యాంటిజెన్ పరీక్షల్లో రోహిత్‌కు వైరస్ నిర్ధారణ అయినట్లు బీసీసీఐ ఆదివారం ట్వీట్ చేసింది. దీంతో జూలై 1 నుంచి ఇంగ్లండ్‌తో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు రోహిత్ దూరం కానున్నాడు. అటు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో జట్టు పగ్గాలు బుమ్రాకు ఇస్తారని ప్రచారం […]
విజయవాడలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఐదుగురు రౌడీషీటర్లను నగర బహిష్కరణ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా శనివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెవర శ్రీను అలియాస్ పిల్ల శ్రీను, మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచర్ల బాలస్వామి అలియాస్ పండు, పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని బానవతు శ్రీను నాయక్, అజిత్ సింగ్ నగర్ పరిధిలోని మల్లవరపు విజయ్ కుమార్ అలియాస్ మసలం, […]
నిత్యం వివాదాలతో సావాసం చేసే సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఏపీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేస్తామని ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. ద్రౌపది ముర్ము పై ఆర్జీవీ అనుచిత వాఖ్యలు చేయటం దురదృష్టకరమన్నారు. ఆర్జీవీ వెంటనే తన వాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆర్జీవీ సినిమా రంగంలో పనిచేసే వ్యక్తి అని, […]
శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా మహిళలు 2-0 తేడాతో కైవసం చేసుకున్నారు. శనివారం దంబుల్లా వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై భారత్ అలవోకగా గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మేరకు శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఓపెనర్లు విష్మి గుణరత్నే (45), కెప్టెన్ ఆటపట్టు […]