జూలై 8,9 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో వైసీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించబోతున్నామని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా గత మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి పథకాలు అమలు చేసిందో ప్రజలకు వైసీపీ నేతలు వివరించాలని ఆయన సూచించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని ఆయన స్పష్టం చేశారు. అటు పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఓట్లు చీలనివ్వనంటాడు.. బీజేపీతో పొత్తులో ఉన్నామంటారు.. ఒకసారి మూడు […]
ఇంగ్లండ్‌తో కీలక టెస్టుకు ముందు లీసెస్టర్ షైర్‌తో ఆడుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా తడబడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 246/8 వద్ద డిక్లేర్ చేసింది. రోహిత్, కోహ్లీ, అయ్యర్, గిల్ వంటి ప్రతిభావంతులు భారీ స్కోర్లు చేయలేనిచోట తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ ఒక్కడే టీమిండియా పరువు కాపాడాడు. అతడు 70 పరుగులతో రాణించడంతో భారత్ 200 పరుగులకు పైగా స్కోర్ చేయగలిగింది. కోహ్లీ (33), రోహిత్ (25), […]
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. చాలా దేశాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభం కావడంతో మరణాల రేటు ఎక్కువగా నమోదైంది. అయితే కరోనా వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రాకపోతే ఈ మరణాల రేటు భయంకరంగా ఉండేది. ఇది అందరూ అంగీకరించాల్సిన విషయం. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కరోనాను నిరోధించినట్లు ది లాన్సెట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా నివారించగలిగిన మరణాలపై బ్రిటన్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజ్ లండన్ నిపుణులు అధ్యయనం […]
మౌలిక సదుపాయల ఆధునీకరణకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రపంచ బ్యాంక్ చేయూత అందించనుంది. ఈ మేరకు 245 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1911 కోట్లు) రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంకు ముందుకొచ్చింది. ఏడేళ్ల గ్రేస్ పీరియడ్ సహా 22 ఏళ్లలో ఈ రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. భారత్ చేపడుతున్న ‘రైల్ లాజిస్టిక్స్ ప్రాజెక్టు’కు ఈ నిధులు వినియోగించనున్నారు. సరకు రవాణా వేగవంతం, ప్రయాణికులను మరింత సురక్షితంగా, వేగంగా గమ్యం చేర్చడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ బ్యాంక్ […]
అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను ఏటీసీ టైర్స్ కంపెనీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ ప్లాంట్ ప్రారంభోత్సవానికి రావాలని సీఎం జగన్‌ను ఏటీసీ టైర్స్ డైరెక్టర్ తోషియో ఫుజివారా, కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కూడా పాల్గొన్నారు. విశాఖపట్నం అచ్యుతాపురం వద్ద ఏపీఐఐసీ కేటాయించిన భూమిలో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ నూతన ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు […]
ఇండియాలో భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది. భారత్‌లో ఎన్నో మతాలు, ఎన్నో ఆచార వ్యవహారాలు, ఎన్నో సంప్రదాయాలు ఉంటాయి. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేవరకు ఎన్నో రకాలుగా పుట్టు వెంట్రుకలు తీస్తారు. ఇంట్లో పుట్టిన బిడ్డకు కొన్నాళ్ళ తర్వాత గుండు కొట్టిస్తారు. పిల్లలు పుట్టిన ఆరు లేదా తొమ్మిది నెలలకు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లి గుండు కొట్టిస్తుంటారు. ఈ కార్యక్రమాన్ని పుట్టు వెంట్రుకలు తీయడం అంటారు. చిన్నారి మేనమామ మొదటగా కొన్ని వెంట్రుకలు కత్తిరిస్తాడు. […]
టీడీపీపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆర్ధికపరమైన అంశాల్లో మాజీ మంత్రి యనమల తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆర్ధిక నిర్వహణ చక్కగా చేశారంటూ ఏపీ ప్రభుత్వాన్ని కాగ్ ప్రశంసించిందని బుగ్గన గుర్తుచేశారు. బడ్జెట్ అంచనాలకంటే తక్కువగానే అప్పులు చేశారని ఏపీని ఉద్దేశించి కాగ్ ప్రస్తావించిందన్నారు. దేశంలోనే ఆర్ధిక నిర్వహణ చక్కగా చేస్తోన్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రభాగంలో ఉందన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే యనమల రాంగ్ […]
శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టేందుకు కెబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అమ్మ ఒడి నిధుల విడుదలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని.. ఈనెల 27న అమ్మ ఒడి పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేస్తారని తెలిపారు. అటు క్రీడాకారిణి జ్యోతి సురేఖకు డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. ఆక్వా […]
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్ హెన్రీ నికోల్స్‌ను దురదృష్టం వెంటాడింది. ఇంగ్లండ్ స్పిన్నర్ లీచ్ బౌలింగ్‌లో నికోల్స్ షాట్ ఆడగా అది అవతలి ఎండ్‌లో ఉన్న డారిల్ మిచెల్ బ్యాట్‌కు తగిలి నేరుగా ఫీల్డర్ చేతిలో పడింది. దీంతో అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. చేసేందేమీ లేక న్యూజిలాండ్ ఆటగాడు నికోల్స్ నిరాశగా వెనుదిరిగాడు. అయితే ఈ అవుట్ పట్ల ఇంగ్లండ్ బౌలర్ జాక్ లీచ్ కూడా కాసేపు అయోమయంలోనే ఉండిపోయాడు. హెన్రీ నికోల్స్ ఎలా […]
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లాకు డా.బీఆర్.అంబేద్కర్ పేరును ఖరారు చేస్తూ ఆమోదముద్ర వేసింది. దీంతో ఇకపై కోనసీమ జిల్లా డా.బీఆర్.అంబేద్కర్ జిల్లాగా మారనుంది. కేబినెట్‌లో 32వ అంశంగా కోనసీమ జిల్లా పేరును కేబినెట్ ప్రతిపాదించింది. ఇటీవల కోనసీమ జిల్లా మార్పు అంశంపై అమలాపురంలో తీవ్ర ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులపాటు కోనసీమ జిల్లా వ్యాప్తంగా […]