Peddi Reddy: చంద్రబాబు హయాంలో వర్షాలు పడలేదు.. రోడ్లు పాడు కాలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ ప్లీనరీ సమావేశం జరిగింది. ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు భరత్, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, వేంకటేష్ గౌడ, జెడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. కరోనా వల్ల గత రెండేళ్లు వైసీపీ ప్లీనరీ జరుపుకోలేకపోయామని..జూలై 8, 9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ సమావేశం జరుగుతుందని తెలిపారు. 95 శాతం ఎన్నికల హామీలు పూర్తి చేసిన ఘనత సీఎం జగన్‌దే అన్నారు. 500 హామీలు ఇచ్చి మేనిఫెస్టో మాయం చేసిన ఘనత చంద్రబాబుదే అని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు.
వైసీపీలో ఏ సమస్యలు ఉన్నా నేరుగా తనకు సమాచారం అందిస్తే తక్షణం స్పందిస్తానని సూచించారు. తనపై బాధ్యతలు ఎక్కువగా ఉండటంతో నేరుగా గడప గడపకు వెళ్లలేకపోయానని తెలిపారు. తన తరపున ఇతర నాయకులు గడప గడపకు తిరుగుతున్నారని.. వైసీపీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలలోకి తీసుకెళ్లాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. కులం, మతం, పార్టీ చూడకుండా పేదరికం చూసి వైఎస్ జగన్ పథకాలు అందిస్తున్నారని ప్రశంసించారు. ఎన్నికల్లో ఓడిపోయినా వారిని జన్మభూమి కమిటీల్లో వేసిన వ్యక్తి చంద్రబాబు అని.. ఆ కమిటీల్లో వారు వాళ్లకు కావాల్సిన వారికి మాత్రమే పథకాలు ఇచ్చే వారని విమర్శలు చేశారు. ఆసరా కింద రూ.26 వేల కోట్లను నాలుగు విడతల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. గతంలో డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి చంద్రబాబు మోసం చేశారన్నారు. తన ఇన్నేళ్ల రాజకీయ ప్రయాణంలో 95 శాతం హామీలు అమలు చేసిన వేరే ముఖ్యమంత్రిని తాను చూడలేదన్నారు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు ఇచ్చేందుకు ఆరు జిల్లాలకు రూ.8 వేల కోట్లకు పైగా సీఎం జగన్ మంజూరు చేశారన్నారు. గండికోట నుంచి మనకు నీరు ఇచ్చేందుకు రూ. 2,700 కోట్లతో ప్రాజెక్టులు సిద్ధం చేస్తున్నామన్నారు. చంద్రబాబు హయాంలో అసలు వర్షాలు పడేవి కాదని.. అందుకే రోడ్లు పాడు అయ్యేవి కాదని మంత్రి పెద్దిరెడ్డి అభిప్రాయపడ్డారు. కానీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. అక్కడక్కడా రోడ్లు పాడైనా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
Also Read
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు