వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గిరీషయ్య ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. లవ్, ఇగో ప్రధాన అంశాలతో తెరకెక్కిన ఈ మూవీ ఈ టీజర్ ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తోంది. ‘నన్నే చూస్తావ్.. నా గురించే కలలు కంటావ్.. కానీ నీకు నాతో మాట్లాడటానికి ఇగో’ అని […]
శ్రీకాకుళం జిల్లా పర్యటనలో జగనన్న అమ్మ ఒడి నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. 43 లక్షల 96 వేలమంది తల్లుల ఖాతాల్లో నేరుగా రూ.6,595 కోట్లను జమ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అమ్మ ఒడి స్కీం ద్వారా గత మూడేళ్లలో అక్క చెల్లెమ్మల ఖాతాలలో మొత్తం రూ.19,618 కోట్లను జమ చేశామని తెలిపారు. ప్రతి తల్లి తమ బిడ్డలను మంచిగా చదివించాలని తాపత్రయపడుతుందని.. అలాంటి వాళ్లకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని […]
సెప్టెంబర్ నెల కోటా తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.46,470 టికెట్లలో లక్కీ డిప్ ద్వారా 8,070 టికెట్లు కేటాయించారు. ముందువచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన 38,400 టికెట్లు జారీ చేస్తున్నారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన టికెట్లను ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయించారు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కెట్లు జూన్ 29వ తేదీ సాయంత్రం 4గంటలకు విడుదల అవుతాయని అధికారులు తెలిపారు. […]
బాలీవుడ్ ప్రముఖ నటులు రణ్‌బీర్‌కపూర్, ఆలియా భట్ తమ ప్రేమ బంధాన్ని ఇటీవల పెళ్లిగా మార్చుకున్న సంగతి తెలిసిన విషయమే. వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆలియాభట్ వరుసగా సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఆమె ప్రెగ్నెంట్ అని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పిక్‌ను ఆలియాభట్ షేర్ చేసింది. తమ బేబీ త్వరలో వస్తోంది అంటూ ఆమె రాసుకొచ్చింది. ఈ పిక్‌లో ఆలియా ఆస్పత్రిలోని బెడ్‌పై పడుకుని ఉండగా.. పక్కన టీవీ మానిటర్‌లో లవ్ […]
ఏపీ సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. జగనన్న అమ్మ ఒడి నిధులను విడుదల చేసేందుకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన శ్రీకాకుళం చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు వైసీపీ ముఖ్య నేతలు సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికారు. పలువురు మంత్రులు, వైసీపీ ప్రజాప్రతినిధులు హెలిప్యాడ్ వద్ద జగన్‌కు స్వాగతం పలికారు. అయితే సీఎం హెలిప్యాడ్ వద్దకు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వెళ్లేందుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆమె అధికారుల ఆగ్రహం […]
పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. పుష్ప ది రైజ్ మూవీ ఘనవిజయం సాధించడంతో జాతీయ స్థాయిలో బన్నీకి గుర్తింపు వచ్చింది. దీంతో పుష్ప సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పుష్ప ది రూల్ మూవీ కోసం జోరుగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. పుష్ప-1 కంటే పుష్ప-2 సినిమాను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని దర్శకుడు సుకుమార్ కృతనిశ్చయంతో ఉన్నాడు. పుష్ప ది రూల్ మూవీ […]
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ వచ్చేనెలలో ఏపీలో పర్యటించనున్నారు. ఈ మేరకు జూలై 4న ప్రధాని మోదీ భీమవరంలో పర్యటించి అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. జూలై 4న విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి భీమవరం వెళ్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. తొలుత రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి భీమవరం వెళ్తారని భావించినా సెక్యూరిటీ కారణాల వల్ల ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు. […]
యూజర్లకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకురావడంలో వాట్సాప్ ముందుంటుంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని మెసెంజర్ యాప్‌లు ఉన్నా యూజర్లు వాట్సాప్ వాడటాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇప్పటికే పేమెంట్స్ వంటి ఫీచర్లను కూడా వాట్సాప్ ప్రవేశపెట్టింది. తాజాగా మహిళల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మహిళలు తమ నెలసరిని సులువుగా ట్రాక్ చేసేందుకు వీలుగా సిరోనా హైజెనీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కలిసి వాట్సాప్ ఈ ఫీచర్‌ను ప్రారంభించింది. దేశంలో తొలిసారిగా వాట్సాప్ […]
అమరావతిపై హైకోర్టు తీర్పు తర్వాత అక్కడ అభివృద్ధి పనుల కోసమంటూ భూములను ఎకరా రూ.10 కోట్ల చొప్పున అమ్మేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి విమర్శలు చేశారు. రాజధాని అమరావతిని ఆనాడు స్మశానం అని ప్రచారం చేసి ఈరోజు ఎకరం భూమి రూ.10 కోట్లకు ఎలా అమ్మకానికి పెట్టారని వైసీపీ నేతలను లోకేష్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి […]
దేశంలో బ్రిటీష్ పాలనకు చరమగీతం పాడిన మహానుభావుల్లో అల్లూరి సీతారామరాజు కూడా ఉంటారు. 1897 జూలై 4న విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు జన్మించారు. అయితే చిన్నతనంలోనే ఆధ్యాత్మికతకు ఆకర్షితుడు అయ్యి ఆయన చదువు మానేసి సన్యాసిగా మారి పశ్చిమగోదావరి జిల్లా అడవుల్లో నివసించేవారు. అడవుల్లో జీవనం సాగించే సమయంలోనే బ్రిటీష్ వారి అటవీ చట్టాల ద్వారా గిరిజనులపై జరుగుతున్న దాడులను అల్లూరి తన కళ్లారా చూశారు. దీంతో గిరిజనుల కష్టాలను తొలగించాలని ఏకంగా బ్రిటీష్ వారిపైనే సమరానికి […]