Team India: కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా.. కోహ్లీకి పగ్గాలు ఇవ్వాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టులో కరోనా కలకలం రేగింది. కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డాడు. శనివారం నిర్వహించిన యాంటిజెన్ పరీక్షల్లో రోహిత్‌కు వైరస్ నిర్ధారణ అయినట్లు బీసీసీఐ ఆదివారం ట్వీట్ చేసింది. దీంతో జూలై 1 నుంచి ఇంగ్లండ్‌తో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు రోహిత్ దూరం కానున్నాడు. అటు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో జట్టు పగ్గాలు బుమ్రాకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే 35ఏళ్ల తర్వాత భారత కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా రికార్డు సృష్టించనున్నాడు. గతంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్లలో కపిల్ దేవ్ ఒక్కడే టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
రోహిత్ కరోనా బారిన పడటంతో ప్రస్తుతం టీమ్ బస చేస్తున్న హోటల్‌లోనే ప్రత్యేకంగా అతడు క్వారంటైన్‌లో ఉన్నట్లు బీసీసీఐ వెల్లడించింది. లీసెస్టర్ జట్టుతో జరుగుతోన్న వార్మప్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేసిన రోహిత్ రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగలేదు. అయితే రోహిత్ జట్టుకు దూరమైన నేపథ్యంలో విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కోహ్లీ సారథ్యంలోనే భారత్ నాలుగు టెస్టులలో 2-1తో నిలిచిందని, రీ షెడ్యూల్ అయిన చివరి టెస్ట్‌లో కూడా అతని సారథ్యంలోనే బరిలోకి దిగాలని అభిమానులు కోరుతున్నారు. కనీసం ఈ ఒక్క మ్యాచ్‌కైనా కోహ్లీని కెప్టెన్ చేయాలని బీసీసీఐని రిక్వెస్ట్ చేస్తున్నారు. రోహిత్ శర్మ అందుబాటులో లేకుంటే విరాట్ కోహ్లీనే కెప్టెన్ చేయడం సరైన నిర్ణయమని క్రికెట్ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
Also Read
- SA Vs AUS: ఆస్ట్రేలియాపై వీర విహారం.. సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ మాథ్యూ..
- Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
- Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
- Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..
UPDATE – #TeamIndia Captain Mr Rohit Sharma has tested positive for COVID-19 following a Rapid Antigen Test (RAT) conducted on Saturday. He is currently in isolation at the team hotel and is under the care of the BCCI Medical Team.
— BCCI (@BCCI) June 25, 2022
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!