IND Vs SL: శ్రీలంకతో మహిళల టీ20 సిరీస్ టీమిండియాదే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా మహిళలు 2-0 తేడాతో కైవసం చేసుకున్నారు. శనివారం దంబుల్లా వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై భారత్ అలవోకగా గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మేరకు శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఓపెనర్లు విష్మి గుణరత్నే (45), కెప్టెన్ ఆటపట్టు (43) రాణించారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్లు తీసుకుంది. రేణుక సింగ్, పూజా, రాధాయాదవ్, హర్మన్ ప్రీత్ కౌర్ తలో వికెట్ పడగొట్టారు.
126 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మంచి శుభారంభం దక్కింది. స్మృతి మంధాన 34 బంతుల్లో 39 పరుగులు, షఫాలి వర్మ 10 బంతుల్లో 17 పరుగులు, సబ్బినేని మేఘన 10 బంతుల్లో 17 పరుగులు చేశారు. దీంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. పది ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 80 పరుగులకు చేరుకుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (31 నాటౌట్)తో కలిసి 3వ వికెట్‌కు స్మృతి మంధాన 38 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. దీంతో 11వ ఓవర్ చివరి బంతికి 86 పరుగుల వద్ద ఔటయ్యింది. స్మృతి అవుటైన తర్వాత స్కోరు వేగం మందగించింది. దీంతో హర్మన్ ప్రీత్‌కౌర్ ఆచితూచి ఆడింది. 20వ ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టి హర్మన్ ప్రీత్ కౌర్ గెలుపు లాంఛనాన్ని పూర్తి చేసింది. శ్రీలంక బౌలర్లలో రణిసింగే, రణవీర తలో రెండు వికెట్లు పడగొట్టారు. హర్మన్ ప్రీత్ కౌర్ ఆల్‌రౌండ్ ప్రతిభ చూపడంతో ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Also Read
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
- India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
- Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
IND Vs IRE: కుర్రాళ్లకు మంచి ఛాన్స్.. రేపటి నుంచే ఐర్లాండ్‌తో టీ20 సిరీస్
తాజావార్తలు
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!