ఇటీవల కాలంలో అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోయింది. ఆయుధాల తయారీలో అమెరికా అగ్రస్థానంలో ఉండటం కూడా దీనికి కారణం. అయితే గత నెలలో న్యూయార్క్, టెక్సాస్‌లో సామూహికంగా కాల్పులు జరిగాయి. ఆయా ఘటనల్లో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో అమెరికాలో తుపాకుల వినియోగం నియంత్రణకు అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గన్ కంట్రోల్ చట్టాన్ని ఆమోదిస్తూ తాజాగా జో బైడెన్ సంతకం చేశారు. […]
రాజధాని అభివృద్ధి నిధుల సేకరణకు అమరావతిలోని భూములను విక్రయించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో 248.34 ఎకరాలను అమ్మాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. కనీస ధర ఎకరాకు రూ.10 కోట్లుగా నిర్ధారించింది. ఈ మేరకు వేలం ద్వారా భూముల విక్రయానికి అనుమతిస్తూ 389 జీవోను ప్రభుత్వం జారీ చేసింది. భూముల విక్రయం ద్వారా ఎకరాకు రూ.10 కోట్ల చొప్పున రూ.2,480 కోట్లను ప్రభుత్వం సేకరించనుంది. గతంలో బీఆర్ శెట్టి మెడిసిటీ కోసం కేటాయించిన 100 ఎకరాలు, లండన్ […]
అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించి పేదల ఆకలి తీర్చాలంటూ ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఏపీ వ్యాప్తంగా అన్నా క్యాంటీన్‌లు అర్జెంటుగా తెరవాల్సిన అవసరం ఉందని లేఖలో లోకేష్ పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నగారి పేరు మీద ద్వేషమో .. ఆకలి జీవులంటే అసహ్యమో తెలియదు కానీ అన్నా క్యాంటీన్‌లను మూసేశారని ఆరోపించారు.అన్న క్యాంటీన్లకు తాళాలు వేయడంతో పేదలు, కూలీలు, అభాగ్యుల ఆకలి తీర్చే […]
ప్రస్తుత కాలంలో కొందరు యువకులు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటారు. కొందరు ఏదో రకంగా వార్తల్లో నిలవాలని తాపత్రయపడుతుంటారు. అందుకోసం పిచ్చి పనులు, సాహసాలు చేసేందుకు కూడా వెనుకాడరు. ఎదుటివాళ్లను ఆకర్షించేలా ఏదో చేద్దామనుకుంటారు. కానీ ఓ యువకుడు చేసిన పిచ్చి పనికి ఫలితం అనుభవించాడు. దీంతో అతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. వివరాల్లోకి వెళ్తే.. ఓ యువకుడు తనకు రోడ్డు […]
ఐపీఎల్ తర్వాత టీమిండియా బిజీ బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా రెండుగా చీలిపోయింది. ఒకే సమయంలో వివిధ సిరీస్‌లు ఉండటంతో సెలక్టర్లు సీనియర్, జూనియర్ జట్లను వేర్వేరుగా ప్రకటించారు. సీనియర్ జట్టు ఇంగ్లండ్‌లో ఉండగా.. జూనియర్ జట్టు ఐర్లాండ్ పర్యటనలో ఉంది. టీమిండియా, ఐర్లాండ్ మధ్య రెండు టీ20ల సిరీస్ ఆదివారం నుంచే ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు […]
విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిని పొగాకు నిషేధిత ప్రాంతంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రకటించారు. ఈనెల 26 నుంచి ఆలయ పరిసర ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఆలయ మెట్ల భాగం నుంచి కొండపై వరకు పొగాకు ఉత్పత్తులు నిషేధించినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులు, భక్తులు నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.20 నుంచి 200 వరకు ఫైన్ వసూలు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆలయ పరిసరాల్లో పొగాకు నిషేధిత సర్క్యులర్‌ను స్వయంగా […]
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లోని అగ్రశ్రేణి జట్లలో టీమిండియా ఒకటి. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు. అటు వన్డే, ఇటు టీ20లలో టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌గానూ నిలిచింది. టెస్టుల్లోనూ అగ్రస్థానంలో కొన్నాళ్ల పాటు కొనసాగింది. అయితే 1983లో టీమిండియా పసికూన . ఆ ఏడాది జరిగి వన్డే ప్రపంచకప్‌లో అండర్ డాగ్‌గా బరిలోకి దిగింది. ఆనాడు టీమిండియాపై ఎలాంటి అంచనాలు లేవు. సెమీస్‌కు వెళ్తే అదే గొప్ప అనే అభిప్రాయంలో క్రికెట్ పండితులు ఉన్నారు. కానీ కపిల్ దేవ్ […]
లీడ్స్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో బ్యాటింగ్‌లో 100 సిక్సర్లు కొట్టి బౌలింగ్‌లో100 వికెట్లు తీసిన ఆటగాడిగా స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. లీడ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో స్టోక్స్ 18 పరుగులు చేశాడు. ఈ సిక్సర్‌తో టెస్టుల్లో 100 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా స్టోక్స్ నిలిచాడు. ఇప్పటి వరకు అతడు 81 టెస్టులు ఆడి మొత్తం […]
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జీవో జారీ చేసింది. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన అందరికీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెడుతూ జీవో నెంబర్ 5ను ఏపీ ప్రభుత్వం శనివారం నాడు విడుదల చేసింది. […]
టీడీపీ ప్రభుత్వ హయాంలో సంభవించిన తిత్లీ తుఫాన్ సందర్భంగా నష్టపరిహారం పంపిణీలో అవకతవకలు జరిగాయని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్‌లో కీలక చర్చ జరిగింది. తిత్లీ తుఫాన్ నష్ట పరిహారం పంపిణీపై సమగ్ర విచారణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నష్టపరిహారాన్ని రైతులకు పంపిణీ చేశామనే పేరుతో నిధులను పక్కదారి పట్టించారని గత ప్రభుత్వంపై మంత్రి వర్గం ఆరోపణలు చేసింది. మొత్తం 14,135 మంది రైతులకు రూ. 28 కోట్లు పంపిణీ […]