Cricket: చరిత్ర సృష్టించిన మధ్యప్రదేశ్.. తొలిసారి రంజీ ట్రోఫీ కైవసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవాళీ క్రికెట్‌లో మధ్యప్రదేశ్ తన సత్తా చాటుకుంది. ఈ ఏడాది జరిగిన రంజీ ట్రోఫీని మధ్యప్రదేశ్ జట్టు సొంతం చేసుకుంది. 2021-22 సీజన్ రంజీ ట్రోఫీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ జట్టు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ముంబై జట్టుపై ఆరు వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్ గెలిచి చరిత్రలో తొలిసారిగా రంజీ ట్రోఫీని దక్కించుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో ముంబై జట్టు 269 పరుగులు చేయగా మధ్యప్రదేశ్ ముందు 108 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. మధ్యప్రదేశ్ ఈ లక్ష్యాన్ని నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి అధిగమించింది.
వెంకటేశ్ అయ్యర్, అవేష్ ఖాన్ వంటి ప్రతిభావంతులు లేకపోయినా మధ్యప్రదేశ్ జట్టు బలమైన ముంబై జట్టును ఓడించడంపై క్రికెట్ పండితులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తొలిసారి రంజీ ట్రోఫీ గెలిచిన మధ్యప్రదేశ్ జట్టును అభినందిస్తున్నారు. గతంలో ముంబై జట్టు 41 సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది. కాగా మధ్యప్రదేశ్ సాధించిన ఈ విజయం వెనుక కోచ్ చంద్రకాంత్ పండిట్ కృషి ఎంతో ఉంది. సాదాసీదా ఆటగాళ్లుగా ఉన్న రజత్ పాటిదార్, శుభమ్ శర్మ, యశ్ దూబే, హిమాంశు మంత్రి వంటివాళ్లని స్టార్లుగా తీర్చిదిద్దాడు. కోచ్‌గా చంద్రకాంత్ పండిట్‌కు ఇది దేశవాళీ క్రికెట్‌లో ఆరో టైటిల్ కావడం విశేషం.
Also Read
- Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
- BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
- ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
- Gautam Gambhir: హార్దిక్ వస్తే నితీశ్ రెడ్డి పరిస్థితి ఏంటి?.. గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు!
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗪𝗜𝗡! 👏 👏
Madhya Pradesh beat Mumbai by 6 wickets & clinch their maiden #RanjiTrophy title👍 👍 @Paytm | #Final | #MPvMUM
Scorecard ▶️ https://t.co/xwAZ13D0nP pic.twitter.com/XrSp2YzwSu
— BCCI Domestic (@BCCIdomestic) June 26, 2022
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..