మంచు మోహన్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇటీవల కాలంలో రాజకీయాల్లో వైసీపీకి మద్దతిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కూడా మోహన్‌బాబు వైసీపీకి మద్దతిచ్చారు. పలు మార్లు సీఎం జగన్‌ను కూడా కలిశారు. అయితే తాజాగా మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఓ కేసు సందర్భంగా తిరుపతికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తాను బీజేపీ మనిషిని అంటూ ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను కూడా ఒకడిని […]
కరోనా తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనడంతో తిరుమలలో శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరుతోంది. ఈ ఏడాది మార్చి నుంచి ప్రతి నెలా రూ.100 కోట్లకు పైగానే టీటీడీకి శ్రీవారి హుండీ ద్వారా ఆదాయం వచ్చి చేరుతోంది. మే నెలలో తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.129.93 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. జూన్ నెల పూర్తి కాకుండానే రూ.100 కోట్ల మార్కును దాటిందని.. జూన్ 1 నుంచి 26 వరకు రూ.106 […]
అమెరికాలో విషాదకర ఘటన వెలుగుచూసింది. టెక్సాస్ రాష్ట్రంలోని శాన్ ఆంటోనియోలో ఓ రోడ్డుపై ఉన్న ట్రక్కులో 46 మృతదేహాలు బయటపడ్డాయి. మరో 16 మంది ప్రాణాలతోనే ఉండగా వారిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ట్రక్కులో ఉన్న వారు మెక్సికో నుంచి అక్రమంగా అమెరికా సరిహద్దులు దాటినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండటంతోనే ట్రక్కులోని వారు మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. శాన్ ఆంటోనియో నగరం దక్షిణ శివార్లలోని మారుమూల ప్రాంతంలో రైలు పట్టాల పక్కన […]
ఇటీవల సోషల్ మీడియాలో టీడీపీ పొలిటికల్ వింగ్ పెట్టిన పోస్ట్ వివాదానికి కారణమైంది. ఆర్టీసీ బస్సుపై టార్పాలిన్ కవర్ వేసి తరలిస్తుండగా టీడీపీ ఫోటో తీసి ట్రోల్ చేసింది. ప్రభుత్వానికి బయట అప్పు పుట్టడం లేదని ఆర్టీసీ బస్సులను ఇసుక లారీల్లాగా గానీ వాడేస్తున్నారేంట్రా..? అంటూ బ్రహ్మానందం పిక్‌తో మీమ్‌ను టీడీపీ పొలిటికల్ వింగ్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అంతేకాకుండా ఆర్టీసీ బస్సు రూఫ్ ధ్వంసం కావడంతో బాగుచేయించే స్తోమత లేక ఇలా వాడుతున్నారా అనే […]
దేశంలో పెట్రోల్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.8గా నమోదైంది. అటు ఏపీలోని విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.25గా పలుకుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించడంతో వాహనదారులకు కొంత ఊరట లభించింది. అయితే త్వరలో పెట్రోల్ ధరలు మరింత తగ్గుతాయని ప్రచారం జరుగుతోంది. అది ఎలా అంటే పెట్రోల్‌ను కేంద్ర ప్రభుత్వం […]
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) మరో రాకెట్ ప్రయోగానికి వేదిక కానుంది. ఈనెల 30న అక్కడ పీఎస్ఎల్వీ సీ53 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఇస్రో ఉపగ్రహ వాహక నౌక పీఎస్‌ఎల్వీ-సీ53 ద్వారా సింగపూర్‌కు చెందిన మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు. ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్‌ఎస్‌ఐఎల్) కింద ఈ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే ప్రయోగ వేదిక వద్దకు రాకెట్‌ను చేర్చారు. ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించి […]
టీమిండియా, ఐర్లాండ్ జట్ల మధ్య ఈరోజు రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది. రాత్రి 9గంటలకు డబ్లిన్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచిన హార్డిక్ పాండ్యా సేన ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో వర్షం కారణంగా ఓవర్లు కుదించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ వేగంగా ఆడటంలో తడబాటుకు గురైంది. దీంతో ఈరోజు జరిగే మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ డ్రా చేసుకోవచ్చని […]
> ఈరోజు రాత్రి 7:30 గంటలకు వ్యక్తిగత పని మీద ప్యారిస్ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్ దంపతులు > గుంటూరు: నేడు తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం > తిరుపతి: నేడు ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం.. హాజరు కానున్న పలువురు మంత్రులు > నెల్లూరు జిల్లా కోవూరులో నేడు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశం > నేడు తెలంగాణ ఇంటర్ […]
విద్యుత్ జమ్వాల్, శివలీకా ఒబెరాయ్ జంటగా నటిస్తున్న బాలీవుడ్ సినిమా ఖుదా హఫీజ్ ఛాప్టర్ 2. యాక్షన్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఫరూక్ కబీర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో ఓ వీడియో సాంగ్‌ను ఓ మతాన్ని కించపరిచే విధంగా చిత్రీకరించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు హైదరాబాద్ మీర్‌చౌక్ పోలీసు స్టేషన్‌లో షియా కమ్యూనిటీ పెద్దలు ఫిర్యాదు చేశారు. వెంటనే వీడియో సాంగ్ డిలీట్ చేయకుంటే […]
ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హార్డిక్ పాండ్యా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో వికెట్ తీసిన తొలి టీమిండియా కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రెండో ఓవర్ బౌలింగ్ వేసిన పాండ్యా… ఐర్లాండ్ ఓపెనర్ స్టిర్లింగ్‌ను ఔట్ చేసి ఈ ఘనత సాధించాడు. ఇంత వరకు టీ20ల్లో టీమిండియా జట్టుకు నాయకత్వం వహించిన ఆటగాళ్లు ఒక్క వికెట్ కూడా […]