Team India: అరుదైన రికార్డు సాధించిన హార్డిక్ పాండ్యా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హార్డిక్ పాండ్యా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో వికెట్ తీసిన తొలి టీమిండియా కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రెండో ఓవర్ బౌలింగ్ వేసిన పాండ్యా… ఐర్లాండ్ ఓపెనర్ స్టిర్లింగ్‌ను ఔట్ చేసి ఈ ఘనత సాధించాడు. ఇంత వరకు టీ20ల్లో టీమిండియా జట్టుకు నాయకత్వం వహించిన ఆటగాళ్లు ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయారు. గతంలో భారత జట్టుకు టీ20 ఫార్మాట్‌లో ధోనీ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, రహానే, రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, శిఖర్ ధావన్, రిషభ్ పంత్ నాయకత్వం వహించారు. వీళ్లకు సాధ్యం కాని రికార్డును హార్డిక్ పాండ్యా సాధించాడు.
భారత్, ఐర్లాండ్ తొలి టీ20 మ్యాచ్‌ను వర్షం కారణంగా అంపైర్లు 12 ఓవర్లకే కుదించారు. దీంతో ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 12 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. హ్యారీ టెక్టార్ (64 నాటౌట్; 33 బంతుల్లో 64, 36) హాఫ్ సెంచరీ బాది ఐర్లాండ్‌కు గౌరవ ప్రదమైన స్కోరు అందించాడు. అయితే టీమిండియా ఈ లక్ష్యాన్ని 9.2 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్‌గా దిగిన దీపక్ హుడా ఐర్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 47 పరుగులతో అతడు అజేయంగా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ తొలి బంతి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. స్పీడ్ మీటర్ ఏకంగా ఆ బంతి వేగాన్ని గంటకు 201 కిలోమీటర్లుగా చూపించింది. కానీ అది స్పీడ్ మీటర్ తప్పిదమని తేలడంతో సోషల్ మీడియాలో నెటిజన్‌లు మీమ్స్ చేస్తున్నారు.
Also Read
- Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
- Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
- Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
- Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
IND Vs IRE: రాణించిన దీపక్ హుడా, చాహల్.. తొలి టీ20లో టీమిండియా విజయం
తాజావార్తలు
-
సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్‌రావు
-
Harish Rao: ‘22Aతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’..
-
Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
-
Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
-
Nara Lokesh: అక్షర ఆంధ్రకు నారా లోకేష్ కొత్త టార్గెట్.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!