ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏపీలో జనసేన పార్టీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ‘జనవాణి’ పేరుతో వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసింది. దీని ద్వారా సామాన్య ప్రజల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తులు స్వీకరించనున్నారు. జనవాణి కార్యక్రమంలో భాగంగా వచ్చే ఐదు ఆదివారాలు పవన్ ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండి వారి నుంచి వివిధ అంశాలపై అర్జీలను స్వీకరిస్తారని జనసేన పార్టీ వెల్లడించింది. తొలివిడత జనవాణి కార్యక్రమాన్ని జూలై 3న విజయవాడలోని […]
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం మరోసారి సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు, గతంలో క్రిమినల్ కేసు నమోదై ఉండటంతో అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఏబీ వెంకటేశ్వరరావు ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ విభాగం కమిషనర్‌గా పనిచేస్తున్నారు. 1989 ఏపీ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ […]
> నేటితో ముగియనున్న రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ గడువు > శ్రీహరికోట: రేపు జరగనున్న పీఎస్‌ఎల్వీ సీ53 రాకెట్ ప్రయోగానికి ఈరోజు సాయంత్రం 5 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం > శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం పంచాయతీలో నేడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.. పాల్గొననున్న మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు > విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో నేడు వైసీపీ ప్లీనరీ సమావేశం.. హాజరుకానున్న మంత్రి బొత్స, ఎంపీ బెల్లాన, జిల్లా […]
సీనియర్ హీరోయిన్ మీనా నివాసంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో మంగళవారం రాత్రి హఠాత్తుగా మృతిచెందాడు. ఇటీవల పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న విద్యాసాగర్ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కరోనా అనంతరం ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో విద్యాసాగర్‌ను ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. అయితే వైద్యులు ఎంత ప్రయత్నించినా కోలుకోలేకపోవడంతో విద్యాసాగర్ తుదిశ్వాస విడిచాడు. Read Also: Vadde Naveen: బిగ్ బాస్ ఆఫర్ అందుకున్న సీనియర్ స్టార్ హీరో..? […]
డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు చేసినా పసికూన ఐర్లాండ్ ముచ్చెమటలు పట్టించింది. చివరకు 4 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. దీపక్ హుడా సెంచరీతో చెలరేగాడు. 57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 104 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. […]
వైసీపీలో నెమ్మదిగా లుకలుకలు బయటపడుతున్నాయి. సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారని సోమవారం మాజీ మంత్రి బాలినేని ఆరోపించగా.. ఈరోజు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కూడా సేమ్ డైలాగ్స్ చెప్పారు. తాను కూడా బాలినేని తరహాలో సొంత పార్టీ నేతల బాధితుడినేనని కోటంరెడ్డి స్పష్టం చేశారు. సొంత పార్టీ నేతలతో తాను కూడా ఇబ్బంది పడుతున్నానని.. కొందరు ఎమ్మెల్యేలు తన నియోజకవర్గంలో వేలుపెడుతున్నారని.. తన విషయంలో కూడా ఇలా జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. తాను కూడా […]
నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో వైసీపీ నాయకుడి దాష్టీకం బయటపడింది. ఆత్మకూరు ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్ధి తరపున ప్రచారం చేసి ఏజెంట్‌గా నిలబడ్డారన్న అక్కసుతో బీజేపీ మహిళా నేతపై వైసీపీ నాయకుడు హజరత్తయ్య దాడికి పాల్పడ్డాడు. గొల్లపల్లి గ్రామానికి చెందిన పద్మమ్మ అనే మహిళను ఇంటికి పిలిపించి కొట్టి, చిత్రహింసలకు గురిచేసి రూమ్‌లో నిర్బంధించాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని మహిళను బెదిరించాడు. అయితే బాధిత మహిళ భయపడకుండా వైసీపీ నేత హజరత్తయ్యపై […]
టాలీవుడ్‌లో ప్రతి వారం కొత్త సినిమా విడుదలవుతోంది. ఈ వారం (జూలై 1) కూడా పలు కొత్త సినిమాలు విడుదలకు క్యూ కట్టాయి. అయితే వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్న నేపథ్యంలో ఈ వారం విడుదలయ్యే సినిమాలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. మరి ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలేంటో చేసేద్దాం పదండి. పక్కా కమర్షియల్ గోపీచంద్ అంటే యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. దర్శకుడు మారుతి కూడా సపరేట్ ట్రాక్‌లో సినిమాలను […]
ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఛైర్మన్ పల్లోంజీ మిస్త్రీ(93) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని తన నివాసంలో సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. భారత్‌లో పుట్టిపెరిగిన ఆయన 2003లో భారత పౌరసత్వం వదులుకుని ఐర్లాండ్ జాతీయుడిగా మారిపోయారు. గుజరాత్‌లోని పార్సీ కుటుంబంలో 1929లో పల్లోంజీ జన్మించారు. షాపూర్జీ పల్లోంజీ సంస్థ 1865లో ఏర్పాటు కాగా పారిశ్రామిక రంగంలో విశిష్ట సేవలకుగానూ పల్లోంజీ మిస్త్రీని కేంద్ర ప్రభుత్వం 2013లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 150 […]
2019 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా నిలిపిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం నాడు తన రిటైర్మెంట్‌పై మోర్గాన్ ప్రకటన చేసే అవకాశముంది. త్వరలోనే ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో ఆడాలని మోర్గాన్ తొలుత భావించినా ప్రస్తుతం రిటైర్మెంట్ తీసుకోవడానికే అతడు ప్రయత్నిస్తున్నాడు. కొన్నాళ్లుగా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతుండటం, పేలవ ఫామ్ వంటి అంశాల కారణంగా మోర్గాన్ ఈ […]