IND Vs IRE: పోరాడి ఓడిన ఐర్లాండ్.. టీమిండియాదే సిరీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు చేసినా పసికూన ఐర్లాండ్ ముచ్చెమటలు పట్టించింది. చివరకు 4 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. దీపక్ హుడా సెంచరీతో చెలరేగాడు. 57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 104 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అతడికి ఓపెనర్ సంజు శాంసన్ సహకారం అందించాడు. శాంసన్ 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు 77 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (3) త్వరగానే పెవిలియన్ బాట పట్టాడు.
ముగ్గురు ఆటగాళ్లు గోల్డెన్ డకౌట్
అయితే టీమిండియా మరింత భారీ స్కోరు చేయాల్సి ఉంది. చివరి మూడు ఓవర్లలో వడివడిగా వికెట్లు కోల్పోవడంతో చివరి ఓవర్లలో తక్కువ పరుగులు చేసింది. ముగ్గురు ఆటగాళ్లు గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరిగారు. దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్ ఇలా వచ్చి అలా వెళ్లారు. కెప్టెన్ హార్డిక్ పాండ్యా 9 బంతుల్లో 13 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ ఆదిర్ 3 వికెట్లు పడగొట్టగా జోష్ లిటిల్, యంగ్ రెండేసి వికెట్లు సాధించారు.
Also Read
- Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
అనంతరం 226 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్ 40 పరుగులు, బాల్బర్నీ 60 పరుగులతో రాణించారు. వీళ్లిద్దరూ తొలి వికెట్‌కు 72 పరుగులు జోడించారు. హ్యారీ టెక్టర్ 39 పరుగులు చేయగా.. చివర్లో జార్జ్ డాక్‌రెల్ 34 నాటౌట్, మార్క్ ఎడైర్ 23 నాటౌట్‌గా మిగిలారు. ఆఖరి ఓవర్లలో ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ అద్బుతంగా బౌలింగ్ చేయడంతో ఐర్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేయడంతో టీమిండియా తృటిలో ఓటమి నుంచి తప్పించుకుంది. ఈ విజయంతో రెండు టీ20ల సిరీస్‌ను భారత్ 2-0 ఆధిక్యంతో కైవసం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దీపక్ హుడాను వరించింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!